రాబోయే పంచాయతీ ఎన్నికలతో గుజరాత్లో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలు స్థానిక ఎన్నికల్లో గెలిచి పార్టీల బలం నిలుపుకోవాలని చూస్తూన్న తరుణంలో కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలింది. ఆనంద్ జిల్లాలోని ఖండలి గ్రామానికి చెందిన 1500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు భాజపా జిల్లా ఇంఛార్జి జయద్రాత్ సింగ్ పర్మార్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు.
![More than 1500 Congress workers from Anand district join BJP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-congress-supporters-join-bjp-special-7205242_31012021182820_3101f_02222_953.jpg)
![More than 1500 Congress workers from Anand district join BJP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10452310_605_10452310_1612114317439.png)
కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతగా ఉన్న భరత్ సోలంకి, ఖండలి సర్పంచ్, ఆనంద్ జిల్లా పంచాయతీ నిర్మాణ కమిటీ ఛైర్మన్ రాజేంద్రసింహ్ గోహిల్లు కాంగ్రెస్ను వీడిన ముఖ్యనేతల్లో ఉన్నారు.
"కాంగ్రెస్ కార్మికులను నిర్లక్ష్యం చేసింది. దీంతో పార్టీ మారడం అనివార్యం అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధిని చేసి చూపించారు. భాజపా భావజాలంతో ఏకీభవించి మేము పార్టీ మారాం. ఇటీవల అమూల్ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మాకు అన్యాయం జరిగింది."
-భరత్ సోలంకి