ETV Bharat / bharat

మోదీ మళ్లీ వస్తే ఎన్నికలుండవా? - భాజపా

"మోదీ మళ్లీ గెలిస్తే ఎన్నికలు ఉండవు"... కొద్దిరోజులుగా వినిపిస్తున్న మాట. ఇలా అంటుంది విపక్షం మాత్రమే కాదు. అధికార పక్షం కూడా. ఎందుకిలా? నరేంద్రుడు మళ్లీ గెలిస్తే ఏం జరుగుతుంది?

మోదీ మళ్లీ వస్తే ఎన్నికలుండవా?
author img

By

Published : Mar 19, 2019, 3:46 PM IST

Updated : Mar 19, 2019, 8:57 PM IST

ఎన్నికల వేళ అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ సభ్యుల వ్యాఖ్యలను విమర్శనాస్త్రంగా వాడుకుంటోంది కాంగ్రెస్​.

మోదీ మరోసారి గెలిస్తే మళ్లీ ఎన్నికలు ఉండకపోవచ్చని ఇటీవల ఉత్తరప్రదేశ్​కు చెందిన భాజపా నేత సాక్షి మహరాజ్​ వ్యాఖ్యానించారు. ఈ మాటలను ఆసరాగా చేసుకుని భాజపాపై ధ్వజమెత్తారు రాజస్థాన్​ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత ఆశోక్​ గహ్లోత్. మోదీ మళ్లీ ప్రధాని అయితే.... రష్యా, చైనా లాంటి విధానం తీసుకొస్తారని పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో అన్నారు.

"మోదీ హయాంలో ప్రజాస్వామ్యం, దేశం ప్రమాదంలో పడ్డాయి. అధికారం కోసం మోదీ ఎలాంటి పనైనా చేస్తారు. లక్ష్యాన్ని చేరుకోవటానికి పాకిస్థాన్​తో యుద్ధం చేయటానికీ మోదీ వెనకాడరని ప్రజలు అనుకుంటున్నారు."
--అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి

బాలీవుడ్​ సినిమాల్లో నటిస్తే మోదీ మంచి పేరు సంపాదించుకునే వారని ఎద్దేవా చేశారు గహ్లోత్. మోదీని 'తప్పుడు హామీలు ఇవ్వటంలో గురువు'గా అభివర్ణించారు​.

"మావైపే న్యాయం ఉంది, అంతిమంగా నిజమే గెలుస్తుంది. ప్రజలు తెలివైనవారు. నిజానికి, అబద్ధానికి తేడా వారికి తెలుసు. మోదీ విదేశీ పర్యటన సందర్భంగా... అక్కడి భారతీయులతో నిర్వహించిన కార్యక్రమాల కోసం దౌత్య కార్యాలయాలు పనిచేశాయి"

ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించరాదన్నదే భాజపా అభిమతమని ఆరోపించారు గహ్లోత్. అందుకే... ఆ పార్టీ నేతల్లో సహనం లోపించిందని విమర్శించారు. పరిపాలనను విస్మరించి, ప్రభుత్వ సంస్థలను అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాలను వేధించారని ధ్వజమెత్తారు అశోక్​ గహ్లోత్​.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
TUESDAY 19 MARCH
1300
LONDON_ Jordan Peele, Lupita Nyong'o and Winston Duke discuss 'electrifying' new horror thriller, 'Us.'
2200
TBC TIMING: LONDON_ TV names expected the Royal Television Society Awards.
CELEBRITY EXTRA
NEW YORK_ Paris Hilton and Christian Gowan discuss their first big fashion purchase.
NASHVILLE, TN._ British singer-songwriter Yola talks about getting burned in a house fire.
NEW YORK_ Casey Wilson: actress, writer, podcast host and 'Real Housewives' fan.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_Jodi Benson, voice of Ariel, reflects on 'The Little Mermaid' anniversary
Last Updated : Mar 19, 2019, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.