ETV Bharat / bharat

తమిళనాడులో మరో 'తూత్తుకుడి' ఘటన - Sathankulam station

తమిళనాడు తూత్తుకుడి లాక​ప్​డెత్​ కేసు లాంటిదే మరొకటి వెలుగుచూసింది. సాతాంకుళం స్టేషన్​ పోలీసులు.. మార్టిన్​ అనే వ్యక్తిని అన్యాయంగా స్టేషన్​కు తీసుకొని వెళ్లి కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తీవ్ర గాయాలపాలైన కారణంగా బాధితుడిని తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.

months-after-custodial-death-of-father-son-duo-another-case-of-assault-by-cops-emerges-from-thoothukudis-sathankulam
తమిళనాడులో మరో తూత్తుకూడి ఘటన
author img

By

Published : Aug 31, 2020, 8:51 AM IST

తమిళనాడులో సంచలనం సృష్టించిన తూత్తుకుడి తండ్రి-కొడుకుల లాకప్​డెత్​ లాంటి మరొక ఉదంతం వెలుగుచూసింది. సాతాంకుళం స్టేషన్​ అధికారులు ఓ వ్యక్తిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇదీ జరిగింది...

సాతాంకుళంలోని తైక్కా వీధిలో నివాసం ఉంటున్న మార్టిన్​ను ఆగస్టు 23న ఇన్​స్పెక్టర్​ జేవియర్​, అసిస్టెంట్ ఇన్​స్పెక్టర్​ పోలీస్​ స్టేషన్​కు తీసుకొని వెళ్లి చితకబాదారు. మరుసటి రోజు తీవ్రగాయాల కారణంగా తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు బాధితుడు వెల్లడించాడు. ఆగస్టు 24 నుంచి 28 వరకు చట్టవిరుద్ధంగా పోలీసు కస్టడిలో ఉంచారని , తన తరపు న్యాయవాది కోరిన తర్వాతే.. కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నాడు బాధితుడు. తన వాంగ్మూలం విన్న కోర్టు బెయిల్​ మంజూరు చేసినట్లు తెలిపాడు.

మార్టిన్​ను అన్యాయంగా పోలీసు కస్టడిలో ఉంచిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అతని కుటుంబసభ్యులు డిమాండ్​ చేశారు. అలాగే తమకు రక్షణ కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.