ETV Bharat / bharat

'కరోనాపై పోరులో మే నెల ఎంతో కీలకం'

ఇప్పుడు దేశ ప్రజలందరి చూపంతా మే 3 పైనే. ఆ రోజుతో దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ గడువు ముగియనుంది. అయితే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో లాక్​డౌన్​ పొడిగింపే తథ్యమని అధికారులు భావిస్తున్నారు. ఇదే సరైన నిర్ణయమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. కరోనాపై పోరులో భారత దేశానికి మే నెల ఎంతో కీలకమని అంటున్నారు.

Month of May could be 'make or break' for COVID-19 fight, say medical experts
'కరోనాపై పోరులో మే నెల ఎంతో కీలకం'
author img

By

Published : May 1, 2020, 7:13 AM IST

కరోనా వైరస్​పై పోరులో 'మే' నెల ఎంతో కీలకమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. వైరస్​పై భారత్​ విజయం సాధిస్తుందా? లేదా? అన్నది మే నెలపైనే ఆధారపడి ఉందంటున్నారు.

గత కొన్ని నెలలుగా భారత్​ను కరోనా వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్​ కట్టడికి అనేక అస్త్రాలను ప్రయోగించింది కేంద్ర ప్రభుత్వం. అందులో లాక్​డౌన్​ ఎంతో ముఖ్యమైనది. అయితే మే 3న లాక్​డౌన్​ గడువు ముగియనుంది. కానీ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో లాక్​డౌన్​ పొడిగింపు అనివార్యంగా మారనుంది. అదే సరైనదని నిపుణులు కూడా భావిస్తున్నారు. లాక్​డౌన్​తో పాటు హాట్​స్పాట్​ కేంద్రాల్లో మరింత కట్టుదిట్టమైన వ్యూహాన్ని పాటించాలని సూచిస్తున్నారు. గ్రీన్​ జోన్లకు వైరస్​ పాకకుండా చూసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.

వైరస్​ను లాక్​డౌన్​ అరికట్టలేదని.. అయితే దాని వ్యాప్తిని మాత్రమే నియంత్రించగలదన్న విషయాన్ని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు నోయిడాకు చెందిన ఫోర్టిస్​ ఆసుపత్రి వైద్యుడు, పల్మోనాలజీ-క్రిటికల్​ కేర్​ అడిషనల్​ డైరక్టర్​ డా. రాజేశ్​ కుమార్​ గుప్తా.

"రెడ్​ జోన్లలో మరో రెండు వారాలు, అంతకు మించిన రోజుల పాటు కఠినమైన లాక్​డౌన్​ నిబంధనలు అమల్లో ఉండాలి. గ్రీన్​ జోన్లలో కొన్ని ఆంక్షలను సడలించవచ్చు. కానీ ప్రజలు కలవకూడదు. వైరస్​కు విరుగుడు లాక్​డౌన్​ కాదని... దాన్ని వ్యాప్తిని మాత్రమే నియంత్రించగలదని అర్థం చేసుకోవాలి. ఈ పరిణామాల్లో మే నెల ఎంతో ముఖ్యమైనది. వైరస్​పై భారత్​ విజయం సాధిస్తుందా? లేదా? అనేది మేపైనే ఆధారపడి ఉంది."

--- డా. రాజేశ్​ కుమార్​, ఫోర్టిస్​ నోయిడా.

కరోనాపై పోరాటం చేస్తూనే.. ఆర్థికవ్యవస్థపై దృష్టి సారించడం ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే తెలిపారు. ఈ విషయన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. రైళ్లు, విమానాలు, అంతరాష్ట్ర బస్సు సర్వీసులు, షాపింగ్​ మాళ్లు, ప్రార్థనా మందిరాలను తెరవకూడదని.. సర్​ గంగా రామ్​ ఆసుపత్రి ప్రముఖ వైద్యుడు డా. అరవింద్​ కుమార్​ తెలిపారు. గ్రీన్​ జోన్ల సరిహద్దులను మూసివేసి.. కొన్ని కార్యకలాపాలకు మాత్రమే అనుమతినివ్వాలని అభిప్రయాపడ్డారు. కరోనాపై పోరులో దేశం ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉందని.. అయితే మే నెల ఎంతో కీలకమన్నారు అరవింద్​ కుమార్​.

ఈ పరిస్థితుల్లో ఆంక్షలు సడలిస్తే ఎంతో ప్రమాదకరమని మరో వైద్యుడు, మ్యాక్స్​ హెల్త్​ కేర్​ అసోసియేట్​ డైరక్టర్​ డా. రొమ్మెల్​ టికూ పేర్కొన్నారు. మరో నెల రోజులు పాటు ఆంక్షలు ఇలాగా ఉండాలన్నారు.

బుధవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా ఉన్న హాట్​స్పాట్(రెడ్​ జోన్లు)​ జిల్లాల సంఖ్య 129కి పడిపోయింది. రెండు వారాల క్రితం ఆ సంఖ్య 170గా ఉంది. అదే సమయంలో గ్రీన్​ జోన్లు 325 నుంచి 307కు తగ్గాయి. అయితే ఈ రెండు వారాల వ్యవధిలో ఆరెంజ్​ జోన్లు 207నుంచి 297కు చేరాయి.

దేశంలో కరోనా మృతుల సంఖ్య 1074కు పెరిగింది. మొత్తం 33 వేల 50 మంది వైరస్​ బారినపడ్డారు. ఇప్పటివరకు 8,325 మంది కోలుకోగా.. భారత్​లో యాక్టివ్​ కేసుల సంఖ్య 23 వేల 651గా ఉంది.

ఇదీ చూడండి:- లాక్​డౌన్​ కాలంలో మానసిక ఒత్తిడిని అధిగమించటం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.