ETV Bharat / bharat

ఈ ఏడాది వర్షాలు.. సాధారణం కన్నా ఎక్కువే!

author img

By

Published : Sep 7, 2020, 10:02 PM IST

దేశంలో ఈ ఏడాది సాధారణం, అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎమ్​డీ వెల్లడించింది. ఇది వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Monsoon 2020 could end in normal to above normal category: IMD
ఈ ఏడాది వర్షాలు.. సాధారణ కన్నా ఎక్కువే!

ఈ ఏడాది వర్షాకాలం.. సాధారణం, అంతకంటే ఎక్కువ స్థాయిలో ముగిసే అవకాశముందని భారత వాతావరణశాఖ(ఐఎమ్​డీ) అంచనా వేసింది. జూన్​, ఆగస్టులో సాధారణం కన్నా 17శాతం, 24శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని పేర్కొంది. అయితే జులైలో మాత్రం 10శాతం తక్కువ రికార్డయిందని వెల్లడించింది.

వర్షాకాలంలో పూర్తి వర్షపాతం.. దీర్ఘకాలిక సగటు(ఎల్​పీఏ)లో 102శాతం ఉండే అవకాశముందని ఐఎమ్​డీ పేర్కొంది. 96నుంచి104శాతంగా ఉంటే దాన్ని సాధారణ వర్షపాతంగా గుర్తిస్తారు.

సెప్టెంబర్​లో ఇలా...

ఈసారి సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో.. వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుందని భూశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవన్​ అభిప్రాయపడ్డారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ఈ నెల మొదటి వారంలో పర్వత ప్రాంతాలు, ఉత్తరంలోని మైదాన ప్రదేశాలు, దక్షిణ ద్వీపకల్పంలో వర్షాలు అనుకున్న దాని కన్నా ఎక్కువ కురిశాయని రాజీవన్​ వెల్లడించారు. అయితే రెండో వారంలో ఇది తగ్గే అవకాశముందని పేర్కొన్నారు. మూడో వారంలో భారీ వర్షాలు కురుస్తాయని, చివరి వారంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు.

ఇదీ చూడండి:- యాంటీబాడీలు ఉన్నా కరోనా నుంచి రక్షణ కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.