ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా సాగింది. 'బే ఆఫ్ బంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్'-బిమ్స్టెక్ దేశాల అధినేతలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బిమ్స్టెక్ కూటమిలో బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్ భాగస్వాములు.
మోదీ ప్రమాణ స్వీకారానికి వచ్చిన దేశాధినేతలు
- శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన
- నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి
- మయన్మార్ అధ్యక్షుడు యూవిన్ మైయింట్
- భూటాన్ ప్రధాని లొటాయ్ షెరింగ్
- థాయిలాండ్ విదేశాంగ ప్రతినిధి గ్రిసాడా బూన్రాక్
- బంగ్లాదేశ్ కేంద్ర మంత్రి ఏకేఎం మొజామ్మల్ హక్
- మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగనాథ్
- కిరిగిస్థాన్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్బెకొవ్
భారత్‌లో ఇలాంటి విశిష్ట కార్యక్రమాలకు ఇతర దేశాల అధినేతలు హాజరవడం కొత్తేమీ కాదు. 2014లో మోదీ పదవిని స్వీకరించేటప్పుడు సార్క్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో పాకిస్థాన్ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఉన్నారు.
భారత్‌లో పర్యటించిన దేశాల అధినేతలు
2014లో మోదీ అధికారంలోకి రాగానే విదేశీ పర్యటనలపై దృష్టి సారించారు. అదే తీరులో భారత్‌కు విదేశీ నేతలు క్యూ కట్టారు. ప్రపంచంలోని అనేకమంది రాజకీయ ప్రముఖులు... భారత దేశ అతిథి మర్యాదలు స్వీకరించారు.
2014
సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రధాని టోని అబాట్ భారత్ వచ్చారు. యురేనియం ఎగుమతుల ఒప్పందం కుదుర్చుకున్నారు.
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_-13.jpg)
అదే నెలలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పర్యటించారు. గుజరాత్లో పెట్టుబడులకు 3 ఒప్పందాలు చేసుకున్నారు.
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_-9.jpg)
డిసెంబర్లో వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్... రక్షణ సామగ్రి కొనుగోళ్లకు ఒడంబడిక కుదుర్చుకున్నారు.
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_-12.jpg)
2015
జనవరిలో గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_-11.jpg)
ఆ ఏడాదిలోనే అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, జర్మనీ ఛాన్స్లర్ ఎంజెలా మెర్కెల్, జపాన్ ప్రధాని షింజో అబే పర్యటించారు.
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_-4.jpg)
2016
గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకాయిస్ హోలాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఫ్గాన్ అధ్యక్షుడు ఘని మరోసారి దేశానికి వచ్చారు.
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_-3.jpg)
అక్టోబర్‌లో జరిగిన 8వ బ్రిక్స్ సదస్సుకు భాగస్వామ్య దేశాలు దక్షిణాఫ్రికా, చైనా, రష్యా, బ్రెజిల్ అధ్యక్షులు హాజరయ్యారు. నవంబర్‌లో యూకే ప్రధాని థెరిసా మే వచ్చారు.
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_-2.jpg)
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_-14.jpg)
2017
గణతంత్ర వేడుకలకు అబుదబి రాకుమారుడు మహమ్మద్ బిన్ జాయేద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేర్వేరు రంగాల్లో సహకారం పెంపే లక్ష్యంగా ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్నబుల్ దేశంలో పర్యటించారు. సెప్టెంబర్‌లో జపాని ప్రధాని రెండోసారి పర్యటించారు.
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_abudabi.jpg)
నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ హైదరాబాద్‌కు విచ్చేశారు. నగరంలో జరిగిన ప్రపంచ వ్యవస్థాపకత సదస్సుకు హాజరయ్యారు.
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_-7.jpg)
2018
69వ గణతంత్ర వేడుకలకు పది దేశాల అధినేతలకు ఆహ్వానాలు పంపింది మోదీ ప్రభుత్వం. ఆసియా ఖండంలోని బ్రూనై, కాంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం మొత్తం పది దేశాల నుంచి దేశాధినేతలు హాజరయ్యారు. భారత గణతంత్ర వేడుకులు అమోఘమని ప్రశంసించారు.
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_asia.jpg)
2019
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా మెరిశారు. ఈ ఏడాది భారత్‌లో ఇతర దేశాల యువరాజులు కూడా పర్యటించారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, మొనాకో యువరాజు ఆల్బర్ట్-2 భారత్‌ను సందర్శించారు. అర్జెంటీనా అధ్యక్షుడు మాక్రికో మాక్రి వచ్చారు.
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_1-2.jpg)
![modi with world leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3424495_1-1.jpg)
ఇదీ చూడండి: ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులకు ఆహ్వానం..