మహారాష్ట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమైంది. నేడు రాష్ట్రంలోని జల్గావ్, సకోలీలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నట్టు ట్వీట్ చేశారు మోదీ.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో శ్రమించారని... మరోసారి ఆయన ప్రభుత్వానికే అధికారం అప్పగించాలని ప్రజలను కోరనున్నారు మోదీ.
"మహారాష్ట్రలో ప్రచారం చేస్తాను. జల్గావ్, సకోలీ బహిరంగ సభల్లో పాల్గొంటాను. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ నేతృత్వంలో రాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా చేసుకుని ఎన్డీఏ కూటమి.. ప్రజల వద్దకు వెళుతోంది. మరో ఐదేళ్ల పాటు అధికారాన్ని అప్పగించాలని కోరుతున్నాం."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
288 శాసనసభ సీట్లున్న మహారాష్ట్రలో భాజపా 164 సీట్లలో పోటీ చేయనుంది. ఒప్పందం ప్రకారం మిత్రపక్షమైన శివసేనాకు 124 సీట్లు అప్పగించింది.
అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు వెలువడతాయి.
ఇదీ చూడండి:- చెన్నై టూ చైనా: 'మోదీ- జిన్పింగ్ చర్చలు ఫలప్రదం'