గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలో అశాంతి రాజ్యం ఏలిందని విమర్శించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. యువకులు, రైతులు కాంగ్రెస్ పాలనలో నిరాశకు లోనయ్యారన్నారు. ప్రపంచంలోనే అవినీతిమయ ప్రభుత్వమన్న అపప్రథను కాంగ్రెస్ పాలన మూటగట్టుకుందని దుయ్యబట్టారు మోదీ.
న్యం విశేషాధికారాలను తగ్గించాలంటున్న కాంగ్రెస్‌తో ఉగ్రవాద నిర్మూలన సాధ్యమేనా అని ప్రశ్నించారు.
"ఉగ్రవాదం నిర్మూలించాలా వద్దా? మరి ఇది కాంగ్రెస్ నేత చేయగలుగుతారా? కశ్మీర్లో సైనికుల సంఖ్యను కాంగ్రెస్ తగ్గించాలంటోంది. సైన్యం విశేషాధికారాలను తగ్గించాలని అనుకుంటోంది. రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని అనుకుంటోంది. ఇలాంటి ఆలోచనలు కలిగిన వారు ఉగ్రవాదం, నక్సలిజాన్ని నిర్మూలించగలరా? బలహీన, బాధ్యతలేని ప్రభుత్వానికి సామాన్యుల పట్ల పట్టింపు ఉండదు. వారు ప్రతి విషయంలో స్వలాభం చూసుకుంటారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనను గుర్తు చేసుకోండి. బాంబుల మోత, అభద్రత ఉండేది. సగం దేశం నక్సలైట్ ప్రభావంతో ఉండేది. కశ్మీర్, ఉత్తర భారతంలో అశాంతి రాజ్యమేలేది. ఈ అంశాల్ని చెబుతూ మీ మధ్యకు వచ్చాను. మీ ఆశీర్వాదం కోరాను. మీరు నాకు బలమైన ప్రభుత్వాన్ని ఇవ్వండి. నేను మీకు దృఢమైన భారత్‌ను ఇస్తాను అన్నాను. నేడు భారత్ దృఢమైనదా కాదా మీరే చెప్పండి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్రదాడుల హెచ్చరికలు...