విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం మారోమారు ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ... సొంత ప్రయోజనాల కోసమే మహాకూటమి ఏర్పడిందని విమర్శించారు. విపక్షాలకు వారసత్వ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ, దేశాభివృద్ధిపై లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి పదవి కోసం విపక్ష నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
ఎస్పీ- బీఎస్పీ కూటమిపై ప్రధాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామ భక్తులను, చౌకీదార్‌ను కించపరిచేలా ఆ రెండు పార్టీల నేతలు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
"బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను సమాజావాదీ పార్టీ అగౌరపరచిన తీరు మర్చిపోకండి. కేవలం పదవి కోసం, మోదీని గద్దెదింపడం కోసం అంబేడ్కర్‌ను అగౌరపరచిన వారితో బెహన్జీ (మాయావతి) ఇప్పుడు మీరు చేతులు కలుపుతున్నారా? దీని వల్ల అర్థమయ్యేది ఒక్కటే... తమ స్వార్థం కోసం ఆ విషయాన్ని కుర్చీ కింద దాచేసి... కుర్చీకి అతుక్కుపోతారు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఇదీ చూడండి: ట్రంప్‌పై 'ఫోన్' దాడికి యత్నం.. కొద్దిలో మిస్