ETV Bharat / bharat

కరోనాపై సీఎంలతో ప్రధాని సమీక్ష.. లాక్​డౌన్ 6.0 దిశగా ? - corona situation in india

దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో మహమ్మారిని నిలువరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరపనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగళ, బుధవారాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతారు.

mp with cms
లాక్​డౌన్ 6.0 ఖాయమేనా.. నేడు సీఎంలతో మోదీ సమీక్ష
author img

By

Published : Jun 16, 2020, 5:16 AM IST

భారత్​లో కరోనా వైరస్​ వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. వైరస్​ను నిలువరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

మంగళవారం మధ్యాహ్నం జరిగే వీడియో కాన్ఫరెన్స్​ సమావేశంలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్​ గవర్నర్లు, అధికారులతో మాట్లాడతారు మోదీ. పంజాబ్​, కేరళ, గోవా, ఉత్తరాఖండ్​, ఝార్ఖండ్​, ఈశాన్య రాష్ట్రాల సీఎంలు, ఇతర కేంద్రపాలిత ప్రాంత అధికారులు ఇందులో పాల్గొంటారు.

బుధవారం జరగబోయే వీడియో కాన్ఫరెన్స్​ సమావేశంలో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్​తో మాట్లాడనున్నారు ప్రధాని. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర, బంగాల్​, దిల్లీ, కర్ణాటక, గుజరాత్​, బిహార్, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా అంశమై చర్చిస్తారు.

భారత్​లో వరుసగా మూడు రోజులు కరోనా కేసుల సంఖ్య సగటున 11వేలకు పైనే నమోదైంది. మొత్తం కేసుల సంఖ్య 3లక్షల32 వేలు దాటింది. ఇప్పటివరకు 9520 మంది వైరస్​కు బలయ్యారు.

ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో కొవిడ్-19 కట్డడికి తీసుకుంటున్న చర్యలపై శనివారం సమీక్ష నిర్వహించారు మోదీ. ఆయన సూచన మేరకే కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దిల్లీలో అమిత్​ షా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు కార్యచరణ రూపొందించారు.

ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించడం మోదీకి ఇది ఆరోసారి. చివరగా మే 11న సమావేశమయ్యారు.

ఇదీ చూడండి: ఈ టెస్ట్‌ కిట్‌తో 30 నిమిషాల్లోనే కరోనా ఫలితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.