ETV Bharat / bharat

మోదీ మేనియాతో మరోమారు 'మహా'విజయం

author img

By

Published : Oct 24, 2019, 6:17 PM IST

"సీట్ల సంఖ్య తగ్గి ఉండొచ్చు. కానీ మా స్ట్రైక్​ రేట్​ బాగా మెరుగుపడింది"... మహారాష్ట్ర ఎన్నికల ఫలితంపై డిఫెండింగ్​ ఛాంపియన్​ దేవేంద్ర ఫడణవిస్ స్పందన ఇది. ముఖ్యమంత్రి విశ్లేషణ వెనుక ఆంతర్యమేంటి? మహారాష్ట్రలో ఏం జరిగింది? రెండోసారి భాజపా-శివసేన కూటమి అధికారంలోకి వచ్చేందుకు ఉపకరించిన అంశాలేంటి..?

మోదీ మేనియాతో మరోమారు 'మహా'విజయం

"నరేంద్ర-దేవేంద్ర సూత్రం గత ఐదేళ్లలో సూపర్​ హిట్ అయింది. రానున్న రోజుల్లో మహారాష్ట్ర... అభివృద్ధిలో నూతన శిఖరాలకు చేరుతుంది. నరేంద్ర, దేవేంద్ర కలిసి ఉంటే 1+1=11 అవుతుంది, రెండు కాదు."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పన్వేల్​ బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలివి. ప్రధాని మాటలు మరోమారు నిజమయ్యాయి. కలెక్షన్​ కాస్త తగ్గినా... "నరేంద్ర-దేవేంద్ర 2.0" హిట్​ అయింది.

ఐదు నెలల్లోనే డబుల్​ ధమాకా...

2019 మే 23...! ప్రజాస్వామ్య భారత చరిత్రలో అత్యంత అరుదైన రోజు. నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ అసాధారణ విజయం సాధించిన క్షణం. ఐదేళ్ల పాలన తర్వాత 2014ను మించిన స్థాయిలో ఓటర్లు భాజపాకు బ్రహ్మరథం పట్టడం... మోదీ పనితీరుకు లభించిన ప్రజామోదంగా నిలిచింది.

కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 5 నెలలు అయిందో లేదో... మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​ వచ్చింది. మళ్లీ అదే వ్యూహంతో, ఉత్సాహంతో బరిలోకి దిగింది ఎన్డీఏ కూటమి. అభివృద్ధి మంత్రం, మోదీ ప్రజాకర్షణ శక్తికి ఓటర్లు మరోమారు ఫిదా అయ్యారు. నరేంద్రుడు చెప్పిన 'డబుల్​ ఇంజిన్'​ సిద్ధాంతాన్ని నమ్మి దేవేంద్రుడికి పట్టం కట్టారు.

ఓటర్లలో నమ్మకం....

2019 సార్వత్రిక సమరాన్ని ముందుండి నడిపించిన ప్రధాని మోదీ... మహారాష్ట్ర ఎన్నికలనూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విస్తృత ర్యాలీలు నిర్వహించారు. ఆర్టికల్ 370 రద్దు, ముమ్మారు తలాక్​ చట్టం, ఎన్​ఆర్​సీ వంటి సాహసోపేత చర్యలను ప్రస్తావిస్తూ తమది చేతల సర్కారని నిరూపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రజల్లో నమ్మకం కలిగించగలిగారు.

భాజపా అధ్యక్షుడు అమిత్​ షా సహా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.

మహారాష్ట్రలో ఫడణవిస్​ సర్కార్​ అమలుచేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే సర్కార్​ ఉంటే కలిగే లాభాలను ప్రజలు అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

దేవేంద్రుడి నాయకత్వం....

బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తి అయిన దేవేంద్ర ఫడణవిస్ అందరినీ ఏకం చేశారు. వివాద రహితుడిగా పేరు గాంచారు. వ్యూహ చతురతపై అందరి ప్రశంసలు పొందారు. టికెట్ల కేటాయింపులోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూటమిలోనే ఉంటూ విమర్శించే శివసేనతోనూ స్నేహపూర్వకంగా మెలిగారు.

కలహాలున్నా కలిసే...

భాజపా, శివసేన పొత్తు అనేకసార్లు కలహాల కాపురాన్ని తలపించింది. కమలదళంపై శివసేన బాహాటంగానే విమర్శల తూటాలు పేల్చిన సందర్భాలు అనేకం. కానీ... భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎన్నికల సమయానికి శివసేన కూడా పరిస్థితిని అర్థం చేసుకుంది. చివరికి కూటమిగానే బరిలోకి దిగాయి భాజపా-శివసేన. ఠాక్రే కుటుంబమూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆదిత్య ఠాక్రే తొలిసారి ఠాక్రే కుటుంబం నుంచి బరిలోకి దిగి మద్దతుదారులకు ఉత్సాహం తీసుకొచ్చారు.

కనిపించని వ్యతిరేకత..

మోదీ నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏపై పెద్దగా ఎలాంటి వ్యతిరేకతా ప్రజల్లో కనిపించలేదు. విపక్షాలూ తప్పులను ఎత్తిచూపలేకపోయాయి. ఇదే మరోసారి ఓటరు భాజపా వెన్నంటే నిలిచేలా చేసింది. తిరుగుబాటు అభ్యర్థుల కారణంగా కాస్త నష్టపోయినా... తిరిగి అధికారం చేజిక్కించుకుంది.

"2014లో భాజపా 260 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అప్పుడు మేము 122 సీట్లు గెలిచాం. ఈ ఎన్నికల్లో 164 స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగాము. ఈ లెక్కన చూసుకుంటే మా స్ట్రైక్​ రేట్​ పెరిగింది. పోటీ చేసిన స్థానాల్లో 70శాతం గెలుచుకున్నాం."

-దేవేంద్ర ఫడణవిస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

విఫలమైన విపక్షాలు!

2014లో భాజపా-శివసేన అధికారంలోకి రాక ముందు వరుసగా 3 సార్లు కలిస అధికారంలో ఉన్నాయి కాంగ్రెస్​-ఎన్సీపీ. కానీ... ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయడంలో విఫలమయ్యాయి. 2014లో ఒంటరిగా బరిలోకి దిగాయి. భాజపా-శివసేన చేతిలో పరాజయం చవిచూశాయి.

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందూ.. విపక్షాల పొత్తుపై సందిగ్ధం నెలకొంది. ఒంటరిగా ఎన్డీఏను ఎదుర్కోలేమని భావించి చివరిక్షణాల్లో సంధి కుదుర్చుకొని బరిలోకి దిగాయి కాంగ్రెస్​-ఎన్సీపీ. అయితే.. ఆ మేరకు ప్రచారం కనిపించలేదు. ఓటర్లను ఆకర్షించేలా గొప్ప నిర్ణయాలేమీ తీసుకోలేదనే చెప్పాలి. రాహుల్​, శరద్​ పవార్ అంత ప్రజాదరణ ఉన్న మరో నేత వారికి కాంగ్రెస్​లో కనిపించలేదు. మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావించారు. కాంగ్రెస్​-ఎన్సీపీని విపక్ష పాత్రకే పరిమితం చేశారు.

2014లో...

2014లో మోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన అనంతరం.. నిర్వహించిన మహారాష్ట్ర ఎన్నికల్లో భాజపా 122, శివసేన 63 గెల్చుకున్నాయి. కాంగ్రెస్​ 42 స్థానాలే గెల్చుకొని అధికారానికి దూరమైంది.

ఇదీ చూడండి: తొలి మ్యాచ్​లోనే 'ఠాక్రే' సూపర్​ హిట్​- 'కుర్చీ'యే టార్గెట్​!

Viral Advisory
Thursday 24th October 2019
Clients, please note the following addition to our output.
VIRAL (GOLF): At 15 years, six months and 27 days old, England's Josh Hill became the youngest male player to win an Official World Golf Ranking event - the Al Ain Open in the United Arab Emirates. Already moved.
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.