ETV Bharat / bharat

డిసెంబర్​లో నూతన పార్లమెంట్​ భవనానికి మోదీ శంకుస్థాపన! - Parliament building Modi foundation stone

దేశ నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ డిసెంబర్​లో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ ఆవరణలో ఉన్న ఐదు విగ్రహాలను తాత్కాలికంగా తరలించనున్నట్లు తెలిపారు.

Modi likely to lay foundation stone for new Parliament building in Dec
డిసెంబర్​లో నూతన పార్లమెంట్​కు మోదీ శంకుస్థాపన
author img

By

Published : Nov 25, 2020, 11:21 AM IST

Updated : Nov 25, 2020, 12:58 PM IST

దేశ నూతన పార్లమెంట్ భవనానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్​ ప్రథమార్ధంలో శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ పనులు జరగనున్న నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ సహా మొత్తం ఐదు విగ్రహాలను తాత్కాలికంగా అక్కడి నుంచి తరలించనున్నట్లు చెప్పారు. నూతన భవనం పూర్తయ్యాక.. ఈ విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించనున్నట్లు స్పష్టం చేశారు.

16 అడుగుల ఎత్తైన గాంధీ విగ్రహం ప్రస్తుత పార్లమెంట్​ ఒకటో గేట్ ఎదురుగా ఉంది. పార్లమెంట్ సభ్యులు మీడియాతో మాట్లాడేందుకు, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు ఈ ప్రదేశమే కేంద్ర బిందువుగా ఉంది.

తొలుత.. డిసెంబర్ 10న శంకుస్థాపన తేదీగా ప్రతిపాదించారు అధికారులు. అయితే ప్రధాని అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి తుది తేదీని ఖరారు చేయనున్నారు.

సెంట్రల్ విస్తాలో భాగంగా పార్లమెంట్ భవనం, సెంట్రల్ సెక్రెటేరియట్​ను నిర్మించనున్నారు. రాష్ట్రపతి భవన్​ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న మూడు కి.మీ మార్గంలో ప్రభుత్వ భవనాలను ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ విస్తా రీడెవలప్​మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుత పార్లమెంట్​కు సమీపంలోనే కొత్త భవాన్ని నిర్మించనున్నారు. 21 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇవీ చదవండి-

Last Updated : Nov 25, 2020, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.