సార్వత్రిక ఎన్నికల అనంతరం మరోసారి అయోధ్య రామ మందిర నిర్మాణం అంశం తెరపైకి వచ్చింది. భాజపా మిత్రపక్షం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నేడు అయోధ్యను సందర్శించారు.
త్వరలోనే రామ మందిరం నిర్మితమవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఠాక్రే. ఎన్డీఏకు మరింత బలాన్నిచ్చి ప్రజలు గెలిపించినప్పుడు వారి మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
"రామ మందిర నిర్మాణం శివసేన ఆకాంక్ష. నేను ఇంతకుముందే చెప్పాను... ముందు మందిరం.. తర్వాతే ప్రభుత్వం. వీలైనంత త్వరగా మందిర నిర్మాణం జరగాలి. నాకు పూర్తి విశ్వాసం ఉంది. త్వరలోనే మందిరం నిర్మితమవుతుంది. మాతో కలిపి ప్రస్తుత సర్కారు బలంగా ఉంది. ఆపే శక్తి ఎవరికీ లేదు. మోదీకి ఆ దమ్ము ఉంది. ఈ సర్కారు నిర్ణయం తీసుకుంటే నిలువరించే శక్తి ఎవరికీ లేదు. శివసేన మాత్రమే కాదు... యావత్ ప్రపంచంలోని హిందూ సమాజం ఈ నిర్ణయం వెనుక ఉంటుంది. మేము చెప్పేది ఒకటే అత్యవసర ఆదేశం తీసుకురండి- మందిరం నిర్మించండి."
- ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అధ్యక్షుడు
ఇదీ చూడండి: కలిసి నడుద్దాం: అఖిలపక్ష భేటీలో కేంద్రం