ఇటీవలే ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కార్మికులు కాళ్లు కడిగారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా తన వ్యక్తిగత ఖాతాలో జమచేసుకున్న రూ.21లక్షలను కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చారు మోదీ.
ఈ విషయాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేసింది ప్రధాన మంత్రి కార్యాలయం. ప్రధాని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని తెలిపింది.
ప్రపంచంలో అతిపెద్ద ఉత్సవమైన కుంభమేళాను విజయవంతంగా ముగించినందుకు సంబంధిత అధికారులకు, మంత్రులకు, పారిశుద్ధ్య కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్