ప్రధాని నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి.. తనను ట్యూబ్‌లైట్ అని అనడమేంటని ప్రశ్నించారు. మోదీ అసలు ప్రధానిలా వ్యవహరించడం లేదని.. పార్లమెంట్లో విపక్షాల గొంతుకను వినిపించకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై గంటల తరబడి విమర్శలు చేసిన ప్రధాని.. నిరుద్యోగ సమస్యపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రాహుల్.
" సాధారణంగా ప్రధాన మంత్రికి ఒక హోదా, ప్రవర్తనా ఉంటాయి. కానీ మోదీ మాత్రం తన హోదాకు తగ్గట్టుగా ప్రవర్తించటం లేదు. విపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే.. పార్లమెంటులో మా గొంతుక వినిపించకుండా ఉండేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. యువతకు ఉద్యోగాలు కల్పించమని ప్రధానిని కోరాను. కానీ ఆయన.. జవహర్లాల్ నెహ్రూ, పాకిస్థాన్, కాంగ్రెస్ పార్టీ, ఇతర విషయాల గురించి మాట్లాడారు తప్పా.. నిరుద్యోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో సమాధానం చెప్పలేకపోయారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ఇదీ చూడండి: నిర్భయ కేసు: తీహార్ జైలు అధికారుల పిటిషన్ కొట్టివేత