ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దిల్లీ ఎన్నికల్లో సాధించిన విజయానికి అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు.
" దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు. దిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతారని ఆశిస్తున్నా."
- ప్రధాని మోదీ ట్వీట్.
రాహుల్ అభినందనలు
దిల్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి, కేజ్రీవాల్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
ఇదీ చూడండి: ఆప్ విజయం- భాజపా పరాజయం.. కారణాలివే...