మోదీ బయోపిక్ భవితవ్యంపై సుప్రీం కోర్టుకు నేడు ఎన్నికల సంఘం వివరించనుంది. సుప్రీం ఆదేశాల మేరకు చిత్రాన్ని చూసిన ఈసీ తన తుది నిర్ణయాన్ని సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించనుంది. మోదీ చిత్రంపై తన వైఖరిని మార్చుకునే ఆలోచనలో ఈసీ లేదని సమాచారం.
మోదీ బయోపిక్‌పై శుక్రవారమే నివేదిక ఇవ్వాల్సి ఉంది. గుడ్‌ఫ్రైడే రోజు కోర్టు రిజిస్ట్రార్‌కు సెలవు కావటం వల్ల వాయిదా వేసింది ఈసీ. మోదీ చిత్రంపై తీసుకున్న తుది నిర్ణయంపై ఈసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఒక్క రోజు ముందే నిషేధం
మోదీ బయోపిక్‌పై కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు అభ్యంతరాలు తెలిపాయి. పరిశీలించిన ఈసీ.. ఏప్రిల్ 11న విడుదల కావాల్సిన చిత్రాన్ని ఒక్క రోజు ముందు నిషేధించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ సరళిపై ప్రభావం చూపే సినిమాలపై నిషేధం ఉంటుందని ప్రకటించింది.
ఈసీ నిర్ణయంపై నిర్మాతలు కోర్టుకెక్కారు. అభ్యర్థనను పరిశీలించిన సుప్రీం పూర్తి చిత్రాన్ని చూసి నిర్ణయం తీసుకోవాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఈసీ అధికారులు బుధవారం చిత్రాన్ని చూశారు. చిత్ర నిర్మాతలు కూడా వారి అభిప్రాయాలను ఈసీకి గురువారం సమర్పించారు.
వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో 'పీఎం నరేంద్రమోదీ' చిత్రం తెరకెక్కింది.