అయోధ్యలోని రామ జన్మభూమి పరిసర ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించారు. ఆదివారం శ్రీరామ క్షేత్ర ట్రస్టు సభ్యులతో సంప్రదించిన జిల్లా యంత్రాంగం.. ఈ మేరకు ప్రకటించింది.
గతంలో తాత్కాలిక ప్రదేశం నుంచి కొత్తగా నిర్మిస్తోన్న ఆలయానికి రామ్‌లల్లా విగ్రహాన్ని తరలించే సమయంలో పూజారులు, కార్మికులకు మొబైల్ ఫోన్లను తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కేవలం జిల్లా అధికారులు, భద్రతా సిబ్బందికి చరవాణి వినియోగించేందుకు అనుమతినిచ్చారు అధికారులు.
"భద్రతా పరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. భక్తులు.. ఆలయం, పరిసర ప్రాంతాల చిత్రాలను మొబైల్ ఫోన్లతో తీస్తున్నారు. ఇది ప్రమాదకరమైనదని భావిస్తున్నాం."
చంపత్ రాయ్, ట్రస్టు కార్యదర్శి
ఫోన్ల నిషేధంపై ట్రస్టు సభ్యుల నిర్ణయాన్ని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర స్వాగతించారు.