సాధారణంగా సంతాప సభల్లో శోకంతో కన్నీళ్లు పెట్టుకోవడం, మౌనం వహించడాన్ని మనం చూస్తుంటాం. అయితే నేపథ్య సంగీతానికి అద్భుతంగా నృత్యం చేస్తూ సంతాపం తెలపడం మీరు ఎప్పుడైనా చూశారా?
ఛత్తీస్గఢ్లో సమాజిక సంస్థ చాందినీ గోందా వ్యవస్థాపకుడు ఖుమన్లాల్షా, గాయకుడు లక్ష్మణ్ మస్తూరియా ఇటీవలే మరణించారు. వారికి నివాళులు అర్పించడానికి ఓ సంతాప సభను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక, జానపద, సినిమా కళారంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సంతాపసభలో గుండదేహి కాంగ్రెస్ ఎమ్మెల్యే కున్వర్సింగ్ నౌషద్ నృత్యం చేసి... మరణించిన ఇరువురు ప్రముఖులకు ఘనంగా నివాళి అర్పించారు.
ఖుమన్లాల్షా తను చనిపోతూ, ఈ లోకంలో తన కోసం కన్నీళ్లు కార్చడం కంటే, ఒక చక్కని పాట పాడి తనను తలచుకోవాలని కోరుకున్నారు. అందుకే సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కున్వర్ సింగ్ ఈ కార్యక్రమంలో నృత్యం చేశారు.
ఇదీ చూడండి: టోల్గేట్ ఉద్యోగినిని దారుణంగా కొట్టారు