కరోనా రోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వినూత్న ఆలోచన చేశారు కర్ణాటక శివమొగ్గలోని వైద్యాధికారులు. వైరస్ బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రులలోని క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారి కోసం మినీ లైబ్రరీలు ఏర్పాటు చేశారు. రోగులు ఆరోగ్యం గురించి దిగులతో మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మెక్గన్ జిల్లా ఆస్పత్రి, సంగర తాలుకా సబ్ డివిజన్ ఆస్పత్రుల్లో ఈ మినీ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి.
" ఇక్కడ కరోనా బారిన పడిన చాలా మంది రోగులు ఒత్తిడికి లోనవుతున్నారు. ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. పుస్తకాలు చదివితే వారికి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడికి గురిచేసే విషయాల గురించి ఆలోచించరు. "
డా.శ్రీధర్, శివమొగ్గ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్
ఈ మినీ లైబ్రరీలో వేలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని డా. శ్రీధర్ చెప్పారు. వీటిని స్థానిక ప్రచురణకర్తలు, బుక్షాప్ యజమానులు విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.