ETV Bharat / bharat

కశ్మీర్​లో మరో ఉగ్రదాడి- పోలీసు మృతి - కశ్మీర్​లో మరో ఉగ్రదాడి పోలీసు మృతి

Militants gun down policeman, injure another in Pulwama district of south Kashmir
కశ్మీర్​లో మరో ఉగ్రదాడి- పోలీసు మృతి
author img

By

Published : May 21, 2020, 3:34 PM IST

Updated : May 21, 2020, 4:30 PM IST

15:32 May 21

కశ్మీర్​లో మరో ఉగ్రదాడి- పోలీసు మృతి

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు.  

పెర్చు వంతెన సమీపంలో  ఈ ఘటన జరిగింది. సీఆర్​పీఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ముష్కరులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఇండియా రిజర్వ్ పోలీసు 10వ బెటాలియన్​కు చెందిన అనుజ్​ సింగ్​, మహ్మద్​ ఇబ్రహీం ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో అనుజ్ సింగ్​ ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న అధికారులు అదనపు బలగాల్ని ఘటనా స్థలానికి తరలించారు. ముష్కరుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

బుధవారం జమ్ముకశ్మీర్​​ గండేర్​బల్ జిల్లా పాండచ్ ప్రాంతంలో గస్తీ విధులు నిర్వర్తిస్తున్న బీఎస్​ఎఫ్​ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.  

Last Updated : May 21, 2020, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.