కశ్మీర్లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో చదూర ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఇరువురి మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని హిజ్బుల్ ముజాహిదిన్కు చెందిన ఆదిల్ గుల్జార్గా గుర్తించారు పోలీసులు.
ఇదీ చూడండి:'సీఏఏ, ఎన్పీఆర్ను తక్షణమే ఉపసంహరించండి'