ETV Bharat / bharat

మళ్లీ లాక్​డౌన్​పై రాష్ట్రాలకు కేంద్రం క్లారిటీ - రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

కరోనా నియంత్రణ విషయంలో రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్​మెంట్ జోన్ల ఆవల ఆంక్షలు విధించాలని అనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడాలని పేర్కొంది.

mha-issues-guidelines-for-covid-19-surveillance-to-states-and-uts
కరోనాపై కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు
author img

By

Published : Nov 25, 2020, 4:52 PM IST

Updated : Nov 25, 2020, 5:25 PM IST

కరోనా కట్టడిపై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని సూచించింది. సమూహాలను నియంత్రించాలని పేర్కొంది. కంటైన్​మెంట్ జోన్లలో అత్యవసరాలకు మాత్రమే అనుమతులు ఉంటాయని స్పష్టం చేసింది. జిల్లా పోలీసులు, మున్సిపల్ అధికారులు నియంత్రణ చర్యలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. సంబంధిత అధికారులను జవాబుదారీగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

అనుమతి కావాల్సిందే

పరిస్థితిని బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్థానికంగా ఆంక్షలు విధించుకోవచ్చని తెలిపింది హోంశాఖ. అయితే కంటైన్​మెంట్​ జోన్లకే వీటిని పరిమితం చేయాలని సూచించింది. కంటైన్​మెంట్ జోన్ ఆవల లాక్​డౌన్ విధించాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఈ మార్గదర్శకాలు అమలులో ఉంటాయని తెలిపింది.

కరోనా విషయంలో ఇటీవల సాధించిన ప్రగతిని దృష్టిలో ఉంచుకోవాలని హోంశాఖ పేర్కొంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. కార్యాలయాల్లోనూ భౌతికదూరం సాధ్యమయ్యే విధంగా చర్యలు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఒక వారంలో పాజిటివ్ రేటు 10 శాతం దాటిన ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

హోంశాఖ మార్గదర్శకాలు

  • కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా సూక్ష్మ స్థాయిలో కంటైన్​మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలి. కంటైన్​మెంట్ జోన్ల వివరాలను జిల్లా కలెక్టర్​లు వెబ్​సైట్లలో పొందుపర్చాలి. ఆ సమాచారాన్ని కేంద్ర వైద్య శాఖకు అందించాలి.
  • రోజువారీ అవసరాలు మినహా కంటైన్​మెంట్ జోన్లలో ప్రజలు తిరగకుండా చర్యలు తీసుకోవాలి. కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలి. పాజిటివ్ వస్తే 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉంచాలి.
  • జిల్లా అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు కరోనా నియంత్రణ చర్యల అమలును పర్యవేక్షించాలి. ఆయా అధికారులను రాష్ట్ర ప్రభుత్వాలు జవాబుదారీగా ఉంచాలి.
  • ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి.
  • మాస్కులు ధరించనివారికి జరిమానాలు విధించే అవకాశాన్ని రాష్ట్రాలు పరిశీలించాలి.
  • కరోనా నిర్వహణకు జారీ చేసిన జాతీయ మార్గదర్శకాలను పాటించాలి.

అంతర్జాతీయ ప్రయాణాలు, ఈత కొలనులు, ఎగ్జిబిషన్ హాళ్లపై నిషేధం కొనసాగుతాయని స్పష్టం చేసింది హోంశాఖ. సామాజిక, మతపరమైన, సాంస్కృతిక కేంద్రాలు, సినిమా థియేటర్లు 50 శాతం సామర్థ్యంతో కొనసాగుతాయని తెలిపింది. అయితే వీటిపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని వెల్లడించింది.

అంతర్​రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు ఉండకూడదని హోంశాఖ స్పష్టం చేసింది. వైరస్ ముప్పు తీవ్రంగా ఉండే ప్రజలు ఇంట్లోనే ఉండాలని సూచించింది. ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్​ ఉపయోగాన్ని కొనసాగించాలని పేర్కొంది.

Last Updated : Nov 25, 2020, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.