ETV Bharat / bharat

దిల్లీలో 169 రోజుల తర్వాత మెట్రో కూత - దిల్లీ మెట్రో పునరుద్ధరణ

దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల సేవలు పునఃప్రారంభమయ్యాయి. రాజధాని దిల్లీలో 169 రోజుల విరామం తర్వాత మెట్రో రైలు సోమవారం కూతపెట్టింది. ఉదయం 7 గంటల నుంచి సేవలను ప్రారంభించారు అధికారులు.

delhi metro
మెట్రో కూత
author img

By

Published : Sep 7, 2020, 8:12 AM IST

Updated : Sep 7, 2020, 10:16 AM IST

లాక్​డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నిలిచిపోయిన మెట్రో రైళ్లు ఇవాళ పునఃప్రారంభమయ్యాయి. అన్‌లాక్-4లో భాగంగా మెట్రోరైళ్ల నడిపేందుకు కేంద్రం అనుమతివ్వగా.. మహారాష్ట్ర మినహా మిగిలిన ప్రాంతాల్లో సేవలను పునరుద్ధరించారు.

కరోనా నేపథ్యంలో మూతపడిన దిల్లీ మెట్రో.. 169 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం ఉదయం 7 గంటలకు మళ్లీ కూతపెట్టింది.

delhi metro
మెట్రో పరుగులు
delhi metro
మెట్రోలో ప్రయాణం

అయితే, మూడు దశల్లో సేవలను పునరుద్ధరించనున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్​ వెల్లడించింది. మొదటి దశలో భాగంగా ప్రారంభమైన యెల్లో లైన్ ​(సమయ్​పుర్​ బడ్లీ- హుడా సిటీ సెంటర్), గురుగ్రామ్​లోని ర్యాపిడ్​ లైన్లలో పరిమిత సంఖ్యలో సేవలను అందించనున్నట్లు స్పష్టం చేసింది.

delhi metro
మెట్రో
delhi metro
ప్రయాణికులకు థర్మల్ స్కానింగ్
delhi metro
ప్రయాణికులు..

ఇందులో భాగంగా ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, తర్వాత సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు బ్యాచుల్లో రైళ్లను నడుపుతారు. అయితే, అత్యవసర పనులకే మెట్రో వినియోగించుకోవాలని ప్రజలను డీఎంఆర్​సీ కోరింది. మెట్రో రైలు సేవలు ప్రారంభం కావటం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

delhi metro
మెట్రో స్టేషన్​లో భద్రత
delhi metro
మెట్రో స్టేషన్
delhi metro
భద్రతా ఏర్పాట్లు

కరోనా మహమ్మారి విజృంభణతో దేశ రాజధానిలో మార్చి 22 నుంచి మెట్రో సేవలను రద్దు చేశారు.

ఇదీ చూడండి: మెట్రో రైల్​ సేవలకు మార్గదర్శకాలు ఖరారు!

Last Updated : Sep 7, 2020, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.