ETV Bharat / bharat

'భారత్​, పాక్​లు రాజకీయ ఒత్తిళ్లను దాటి చర్చలు జరపాలి'

భారత్​, పాకిస్థాన్​ నాయకత్వాలు తమ రాజకీయ ఒత్తిళ్లను దాటి సరిహద్దు సమస్యపై చర్చలు చేపట్టాలని కోరారు పీడీపీ అధినేత్రి మెహబూబా ముప్తీ. ఇరువైపులా ప్రాణనష్టం పెరగటం విచారకరమన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని సూచించారు.

author img

By

Published : Nov 14, 2020, 3:59 PM IST

Mehabooba mufti
పీడీపీ అధినేత్రి మెహబూబా ముప్తీ

సరిహద్దులో సమస్యలపై భారత్​, పాకిస్థాన్​లు తమ రాజకీయ ఒత్తిళ్లను దాటి చర్చలు చేపట్టాలని కోరారు పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ) వెంబడి ఇరువైపుల పెరుగుతున్న ప్రాణనష్టాన్ని చూడటం చాలా విచారకమన్నారు.

ఎల్​ఓసీ వెంబడి పాకిస్థాన్​ శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడగా.. భారత దళాలు దీటుగా సమాధానమిచ్చాయి. ఈ ఘటనల్లో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగిన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు ముఫ్తీ. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని సూచిస్తూ ట్వీట్​ చేశారు.

  • Sad to see mounting casualties on both sides of LOC. If only Indian & Pakistani leadership could rise above their political compulsions & initiate dialogue. Restoring the ceasefire agreed upon & implemented by Vajpayee ji & Musharaf sahab is a good place to start

    — Mehbooba Mufti (@MehboobaMufti) November 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" ఎల్​ఓసీ వెంబడి ఇరువైపులా ప్రాణనష్టం పెరగటం విచారకరం. భారత్​, పాకిస్థాన్​ నాయకత్వం వారి రాజకీయ ఒత్తిళ్లను దాటి ఆలోచిస్తేనే చర్చలు ప్రారంభమవుతాయి. మాజీ ప్రధాని వాజ్​పేయీ జీ, ముషారఫ్​ సాహబ్​ అంగీకరించి, అమలు చేసిన కాల్పుల విరమణను పునరుద్ధరించేందుకు ఇదే మంచి సమయం."

- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి.

ఇదీ చూడండి: భారత సేన సింహ గర్జనకు తోక ముడిచిన పాక్​ సైన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.