ETV Bharat / bharat

క్షుద్రవిద్యల అనుమానంతో సజీవంగా పాతేశారు! - మేఘాలయలోని షీలాంగ్​లో దారుణం

మేఘాలయలోని షిల్లాంగ్​​లో దారుణం జరిగింది. తమ మేనకోడలిపై క్షుద్రవిద్యలను ప్రయోగిస్తున్నాడనే నెపంతో సొంత మనుషులే ఓ వ్యక్తిని సజీవంగా పూడ్చిపెట్టారు.

Meghalaya:Octogenarian buried alive for 'practising witchcraft', 8 held
క్షుద్రవిద్యల ఆరోపణలతో వ్యక్తి సజీవ ఖననం చేసిన బంధవులు
author img

By

Published : Oct 14, 2020, 8:25 PM IST

Updated : Oct 14, 2020, 8:52 PM IST

మేఘాలయ షీల్లాంగ్​​లోని వెస్ట్​ఖాసీ హిల్స్​కి చెందిన మోరిస్​ మారంగర్​ అనే 80 ఏళ్ల వ్యక్తిని.. బంధువులే సజీవంగా ఖననం చేశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమ మేనకోడలిపై మంత్రపూజలు నిర్వహించాడనే సాకుతో.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతని నలుగురు మేనల్లుళ్లతో సహా కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురిపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

వీరంతా మోరిస్​ను ముఖ్యమైన పని ఉంది అని చెప్పి తీసుకుపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏంతకీ రాకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించామన్నారు. ఈ క్రమంలో మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర హోంమంత్రి స్పందించారు.

"ఈ ఘటన జరగడం చాలా విచారకరం. శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. కేసుపై దర్యాప్తు జరుగుతోంది."

-హోంమంత్రి లఖ్మెన్ రింబుయ్

ఇదీ చూడండి: జరజాగ్రత్త: భారత్​లో 'రీఇన్​ఫెక్షన్​' కేసులు నమోదు

Last Updated : Oct 14, 2020, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.