ETV Bharat / bharat

'పీఎం కేర్స్'​కు భారీ విరాళాలు- రిలయన్స్ రూ.500 కోట్లు - రామ్​దేవ్​ బాబా 25 కోట్లు...

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్​ నిధికి కార్పొరేట్​ సంస్థల నుంచి విరాళాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. ప్రధాని పిలుపు మేరకు మహమ్మారిపై పోరుకు తమ వంతు సాయం చేస్తున్నాయి. రిలయన్స్​ గ్రూప్​ రూ.500 కోట్లు, ఇన్ఫోసిస్​, హీరో చెరో రూ.100 కోట్లు ప్రకటించాయి. ప్రభుత్వ సంస్థలూ పీఎం కేర్స్​కు విరాళాలు అందజేస్తున్నాయి.

MEA officials pledge to donate Rs 1 crore to PM's COVID-19 fund
'పీఎం కేర్స్'​కు భారీ విరాళాలు- రిలయన్స్ రూ.500 కోట్లు
author img

By

Published : Mar 30, 2020, 8:59 PM IST

కరోనాపై పోరు కోసం కేంద్రం ప్రారంభించిన పీఎం కేర్స్​ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు భారీగా సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి.

500 కోట్ల విరాళం...

భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం, రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ప్రతి ఒక్క ఉద్యోగుల తమ ఒక్క రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించాయి. ఇలా మొత్తం రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.

రిలయన్స్​ సంస్థ భారీ విరాళం..

ముఖేశ్​ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్​ ఇండస్ట్రీస్​ పీఎం కేర్స్​కు రూ.500 కోట్లు విరాళంగా అందించనున్నట్లు ప్రకటించింది.

ఎన్​ఎండీసీ, ఎల్​ అండ్​ టీ చెరో రూ.150 కోట్లు

ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎం కేర్స్)కి విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చింది జాతీయ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ. మొత్తం రూ. 150 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఎల్​ అండ్ టీ సంస్థ 150 కోట్లు విరాళంగా అందించనున్నట్లు తెలిపింది.

ఇన్ఫోసిస్​ రూ.100 కోట్లు..

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 100 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో సగ భాగం ఇన్ఫోసిస్​ పౌండేషన్​ భరించనున్నట్లు తెలిపింది.

హీరో వాటా 100 కోట్లు..

హీరో గ్రూప్​ తన వంతు సాయంగా 100 కోట్లు ప్రకటించింది. ఇందులో 50 కోట్లు పీఎం కేర్స్​కు, మిగిలిన సగ భాగాన్ని ఇతర సహాయక చర్యలకు ఖర్చు చేయనున్నట్లు వివరించింది.

రామ్​దేవ్​ బాబా రూ.25 కోట్లు...

ప్రముఖ యోగా గురు రామ్​దేవ్​ బాబా పీఎం కేర్స్​కు రూ.25 కోట్లు అందించనున్నట్లు తెలిపారు. పతంజలి, రుచిసోయా ఉద్యోగలందరూ కలిసి తమ ఒక రోజు జీతం(రూ.1.5 కోట్లు) ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు యోగా గురువు స్పష్టం చేశారు. బంగాల్​లోని కోల్​కతా ఆశ్రమం, ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​, ఉత్తరప్రదేశ్​లోని మోదీనగర్​, హిమాచల్​ ప్రదేశ్​లోని సోలాన్​, అసోంలోని గువహటి ఆశ్రమాలను కరోనా రోగులకు చికిత్స అందిచడం కోసం వినియోగించుకోవచ్చని తెలిపారు.

ఐదు కోట్ల విరాళం...

కరోనా కట్టడి చేసేందుకు తనవంతు సాయం ప్రకటించింది సత్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. మొత్తం ఐదు కోట్ల రూపాయలను విరాళంగా అందించింది.

ఇండియన్ ఇన్ఫోలైన్ సంస్థ..

ప్రముఖ ఇండియన్​ ఇన్ఫోలైన్​ సంస్థ (ఐఐఎఫ్​ఎల్​) పీఎం కేర్స్​కు 5 కోట్లు రూపాయలు విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. తమ సంస్థలో పని చేస్తున్న 18 వేల మంది ఉద్యోగులు కూడా తమ వంతు సాయం చేయటానికి ముందుకు వచ్చినట్లు తెలిపింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ...

దేశంలోని కరోనా వైరస్​ పోరు కోసం పీఎం కేర్స్​ నిధికి కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖాధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని తమ ఒక రోజు జీతం నుంచి ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఈఏసీ- పీఎం...

కరోనా మహమ్మారి కట్టడికి తమ వంతు సాయంగా రెండు నెలలపాటు ఒక రోజు జీతాన్ని ఇస్తున్నట్లు ప్రధానమంత్రి ఆర్థిక సహాయ మండలి తెలిపింది. ఏప్రిల్​, మే నెలల్లో ఈ విరాళాన్ని తమ జీతం నుంచి కోత విధించుకోవచ్చని పేర్కొంది.

ఎన్​సీఎల్​..

కోల్​ ఇండియాకు చెందిన ఎన్​సీఎల్​ కరోనాను నియంత్రించేందుకు 200 పడకలతో కూడిన నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. తమ సంస్థలో పని చేసే మొత్తం 15 వేల మంది ఉద్యోగులు ఒక రోజు జీతాన్ని పీఎం కేర్స్ నిధికి​ విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:దేశంలో ఎమర్జెన్సీనా? అలాంటిదేమీ లేదు: సైన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.