భారత్‌లో మహిళలపై ఇటీవల హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ చేసిన ప్రకటనను విదేశీ వ్యవహారాల శాఖ తప్పుబట్టింది. ఈ ప్రకటన అనవసరమని పేర్కొంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన కేసులపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేసింది. బయటి సంస్థలు అనవరసర వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికింది.
ఈ విషయంపై భారత్‌లోని ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్‌కు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అసమ్మతిని తెలియజేశారు.
"ఇటీవల మహిళలపై జరుగుతున్న హింస గురించి ఐరాస రెసిడెంట్ కోఆర్టినేటర్ కొన్ని అనవసర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని వారు తెలుసుకోవాలి. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు బాహ్య సంస్థలు ఏదైనా అనవసర వ్యాఖ్యలు చేయకుండా ఉండటం ముఖ్యం. భారత్‌లోని పౌరులందరికీ రాజ్యాంగం సమానత్వం ఇచ్చింది. ప్రజాస్వామ్య దేశంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందించిన ఘనత మాకు ఉంది."
-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి
అంతకుముందు.. ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్, బలరాంపుర్ ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలపై ఐక్యరాజ్య సమితి భారత విభాగం విచారం వ్యక్తం చేసింది. వెనకబడిన సామాజిక వర్గాల మహిళలు, బాలికలే లింగ ఆధారిత హింసకు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారనే విషయాన్ని ఈ రెండు ఘటనలు గుర్తు చేస్తున్నాయని పేర్కొంది.
ఇవీ చదవండి