ETV Bharat / bharat

తమిళ నేత వైగోకు జైలు-2009నాటి దేశ ద్రోహం కేసు - ఎండీఎంకే

ఎండీఎంకే అధ్యక్షుడు వైగోకు ఏడాది జైలు శిక్ష విధించింది ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు. 2009, జులై 15న ఓ పుస్తక విడుదల కార్యక్రమంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశద్రోహం కేసు నమోదైంది. లోక్​సభ ఎన్నికల పొత్తులో భాగంగా ఒక రాజ్యసభ సీటును డీఎంకే పార్టీ ఎండీఎంకేకు కేటాయించింది. ఈ సీట్లో పోటీకి సిద్ధపడుతున్నారు వైగో. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన రాజ్యసభ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది.

తమిళ నేత వైగోకు జైలు-2009నాటి దేశ ద్రోహం కేసు
author img

By

Published : Jul 5, 2019, 10:06 PM IST

రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న దశలో ఎండీఎంకే పార్టీ అధినేత వైగోకు చుక్కెదురైంది. 2009నాటి దేశ ద్రోహం కేసులో ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు. భారత ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైకో వ్యాఖ్యలు సెక్షన్ 124ఏ (దేశద్రోహం) కిందికి వస్తాయని జస్టిస్ జే. శాంతి తీర్మానించారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజ్యసభ ఎన్నికల్లో పోటి చేసేందుకు వైగోకు ఎలాంటి అవాంతరం లేదని వాదించారు ఆయన తరఫు న్యాయవాది పి. విల్సన్. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా నెలపాటు శిక్షను వాయిదా వేయాలన్నారు.

లోక్​సభ ఎన్నికలకు ముందు పొత్తుల్లో భాగంగా రాజ్యసభ సీటును ఎండీఎంకేకు ఇచ్చేందుకు డీఎంకేతో ఒప్పందం జరిగింది. ఇదే స్థానంలో పోటీ చేసేందుకు ప్రస్తుతం వైగో సిద్ధపడుతున్నారు.

ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం 2009, జులై 15న చేసిన ఓ పుస్తక విడుదల కార్యక్రమం సందర్భంగా ప్రసంగంలో... శ్రీలంక అంశమై భారత ప్రభుత్వంపై వైగో చేసిన వ్యాఖ్యల ఆధారంగా దేశ ద్రోహం కేసు నమోదు చేశారు.

"శ్రీలంకలో తమిళుల హత్యలు, ఎల్​టీటీఈకి మద్దతిస్తూ నేను చేసిన వ్యాఖ్యలకు కోర్టు విధించిన ఏడాది జైలును సంతోషంగా అంగీకరిస్తాను."

-కోర్టు తీర్పు అనంతరం వైగో

భారత్​ అందజేసిన ఆయుధాలు, ఆర్థిక మద్దతుతోనే లక్షల మంది శ్రీలంక తమిళులను అక్కడి ఆర్మీ చంపిందని అప్పట్లో ఆయన ప్రధాని మన్మోహన్​కు ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో విడుదల చేసిన పుస్తకం తాను అప్పటి ప్రధాని మన్మోహన్​కు శ్రీలంక అంశమై రాసిన లేఖల సంకలనమని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశమై తమిళ పుస్తకం విడుదల చేసినప్పుడు చేసిన వ్యాఖ్యల పైనా మరో దేశద్రోహం కేసు వైగోపై నమోదయింది.

ఇదీ చూడండి: 'నవ భారత్​ బడ్జెట్'​లో ముఖ్యాంశాలివే...

Intro:Body:

z

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.