ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి నేడు ఒకే వేదికను పంచుకోనున్నారు. మెయిన్‌పురిలో జరగనున్న ర్యాలీలో వీరుద్దరు పాల్గొననున్నారు.
ఎస్పీ- బీఎస్పీ కూటమి ఐకమత్యాన్ని ప్రత్యర్థులకు చాటిచెప్పేందుకు ఈ ర్యాలీ ఏర్పాటు చేసినట్టు కూటమి వర్గాలు స్పష్టం చేశాయి.
1995 నుంచి వ్యూహాలతో రాజకీయంగా కత్తులు దూసుకున్న ఈ అగ్ర పార్టీలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఒక్కటయ్యాయి.
దేవ్‌బంద్, బదావ్, ఆగ్రాల్లో కూటమి నిర్వహించిన సభలకు ములాయం గైర్హాజరయ్యారు. మెయిన్‌పురి ర్యాలీలోనూ పాల్గొనడానికి ఆయన సముఖంగా లేకపోయినప్పటికీ... తనయుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆయనను ఒప్పించారని సమాచారం.
ఇరు పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కూటమి విజయానికి తోడ్పడాలని ఇప్పటికే బీఎస్పీ కార్యకర్తలకు మాయావతి పిలుపునిచ్చారు.
ఇదీ చూడిండి: 'జెట్‌ను నిలబెట్టి మమ్మల్ని కాపాడండి'