ఇప్పటి వరకు ఆవు పేడతో పిడకలు, ఎరువులను తయారు చేసేవారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మాస్కుల తయారీకీ దీన్ని శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని వేదిక్ ప్లాస్టర్ సంస్థ వీటిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మాస్కులను ఆ తర్వాత ఎరువుగా కూడా వాడొచ్చు. ఇవి పర్యావరణ అనుకూలమైనవి. 80 శాతం శుద్ధ ఆవుపేడ, 20 శాతం వెస్ట్ కాటన్ వస్త్రంతో కూడిన మిశ్రమాన్ని కాగితానికి జోడించడం ద్వారా వాటిని తయారు చేశారు.
జాతీయ కామధేను కమిషన్ అందించిన ముడి పదార్థాలతో వేదిక్ ప్లాస్టర్ సంస్థ ఈ మాస్కులను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో స్వయం సహాయక బృందాల మహిళలు పాలుపంచుకుంటున్నారు. ఈ మాస్కుల్లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని హోమియో వైద్యుడు రాజ్‌కుమార్ శర్మ తెలిపారు. వాటి వాడకం వల్ల ఎలాంటి హాని ఉండదని చెప్పారు. కూరగాయల విత్తనాలనూ ఉంచామని వేదిక్ ప్లాస్టర్ సంస్థకు చెందిన కరణ్ సింగ్ చెప్పారు.
ఇదీ చూడండి: కేంద్ర మంత్రివర్గంలోకి సుశీల్ కుమార్ మోదీ..?