ETV Bharat / bharat

గుర్తు పెట్టుకోండి.. గెలిచేది మేమే : భాజపా - దిల్లీ ఎగ్జిట్​ పోల్స్​

దిల్లీ ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తప్పుబట్టారు అక్కడి భాజపా చీఫ్​ మనోజ్​ తివారీ. శనివారం జరిగిన శాసనసభ ఎన్నికల్లో 48 సీట్లు గెలుచుకొని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 61.47 శాతం పోలింగ్​ నమోదైంది. తుది సమాచారం ఇంకా రావాల్సి ఉండగా.. ఇది మరింత పెరిగే అవకాశముంది.

Manoj Tiwari rejects exit poll results, claims BJP will win 48 seats in Delhi
గుర్తు పెట్టుకోండి.. గెలిచేది మేమే : భాజపా
author img

By

Published : Feb 9, 2020, 6:09 AM IST

Updated : Feb 29, 2020, 5:16 PM IST

గుర్తు పెట్టుకోండి.. గెలిచేది మేమే : భాజపా

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్​ అనంతరం వెల్లడైన ఎగ్జిట్​ పోల్స్​ మళ్లీ ఆమ్​ ఆద్మీకే పట్టం కట్టాయి. మెజారిటీ స్థానాల్లో జయభేరి మోగిస్తుందని స్పష్టం చేశాయి పలు జాతీయ టెలివిజన్​ ఛానళ్లు, సంస్థలు.

అయితే.. ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలకు విరుద్ధంగా స్పందించారు దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్​ తివారీ. ఎగ్జిట్​ పోల్స్​ విఫలమవుతాయని.. గెలిచేది తామే అని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించవద్దని ట్వీట్​ చేశారు.

MANOJ TIWARY
మనోజ్​ తివారీ ట్వీట్​

'' ఎగ్జిట్​ పోల్స్​ సర్వేలన్నీ విఫలమవుతాయి. నా ట్వీట్​ను సేవ్​ చేసి పెట్టుకోండి. భాజపా 48 సీట్లను గెలుస్తుంది. దిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దయచేసి ఈవీఎంలను నిందించడానికి సాకులు వెతకకండి.''

- మనోజ్​ తివారీ, దిల్లీ భాజపా చీఫ్​

ఎన్నికల ప్రచారంలో భాగంగా హస్తినలో విస్తృత ప్రచారం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాలు.. భాజపా 45 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఉద్ఘాటించారు.

61 శాతం పోలింగ్​...

శనివారం జరిగిన ఎన్నికల్లో 61.47 శాతం పోలింగ్​ నమోదైంది. తుది సమాచారం ఇంకా రావాల్సి ఉండటంతో ఓటింగ్​ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయి. మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్న ముస్తాఫాబాద్​, మటియా మహల్​, శీలంపుర్​ నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్​ నమోదైంది. అయితే.. 2015 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్​ శాతం తగ్గింది. అప్పుడు 67.12 శాతం ప్రజలు.. ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ 67 స్థానాలు గెలుచుకొని భారీ విజయం అందుకుంది. అనంతరం 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఏడుకు ఏడు స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.

ZCZC
PRI SRG
.HYDERABAD SRG3
TL-FESTIVAL
T'gana: 'Sammakka, Saralamma jatatra' concludes
Warangal (Telangana), Feb 8 (PTI) The four-day 'Sammakka
Saralamma jatara', a mega religious congregation of tribals,
concluded at Medaram village in Telangana on Saturday.
The event, attended by an estimated 1.5 crore people,
including non-tribals, concluded with the deities, Sammakka
and Saralamma returning to the forests on Saturday evening as
per tradition.
Telangana Governor Tamilisai Soundarajan, Chief Minister
K Chandrasekhar Rao, Himachal Pradesh Governor Bandaru
Dattatreya and a number of other dignitaries offered prayers
to the deities during the jatara.
Union Tribal Affairs Minister Arjun Munda visited Medaram
on Saturday and offered worship to the deities.
Talking to reporters, Munda assured that the
representation made by Telangana ministers to accord national
status to the jatara would be considered.
He said he will take the matter to the notice of Prime
Minister Narendra Modi.
The Telangana government and the state police had made
elaborate arrangements to conduct the jatara smoothly.
A release from Telangana DGP office on Saturday said
Artificial Intelligence was successfully executed by police
for prevention of any untoward incidents at the jatara.
"Artificial Intelligence technology used by the Telangana
State Police, for the first time in India, was successfully
executed in prevention of any untoward, undesirable incidents
at the Medaram Jatara, where approximately one and half crore
devotees visited the event, it said.
         The 'jatara' has been declared as a state festival by
the Telangana government.
As per folklore, the festival commemorates the fight of
Sammakka and Saralamma against the oppression of Kakatiya
rulers.         PTI COR SJR
APR
APR
02082159
NNNN
Last Updated : Feb 29, 2020, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.