ETV Bharat / bharat

ముఖ్యమంత్రి సోదరుడు కిడ్నాప్​- డిమాండ్లు​ ఇవే...

డబ్బుకోసం ఏకంగా మణిపుర్​ ముఖ్యమంత్రి సోదరుడిని కిడ్నాప్ చేసిన ఘటన కోల్​కతాలో జరిగింది. నిందితులను గంట వ్యవధిలోనే పట్టుకొని బాధితుడ్ని రక్షించారు పోలీసులు.

Manipur CM's brother kidnapped, rescued in Kolkata
ముఖ్యమంత్రి సోదరుడు కిడ్నాప్​- డిమాండ్లు​ ఇవే...
author img

By

Published : Dec 14, 2019, 6:08 PM IST

Updated : Dec 14, 2019, 7:42 PM IST

గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు సీబీఐ అధికారులమని చెప్పి ఏకంగా మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్​ సింగ్ సోదరుడు టోంగ్‌బ్రామ్ లుఖోయ్ సింగ్​ను కిడ్నాప్​ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులు లుఖోయ్​ను రక్షించి ఆ ఐదుగురు నిందితులను పట్టుకున్నారు.

ఇదీ జరిగింది...

లుఖోయ్​ సింగ్​ కోల్​కతాలో నివాసం ఉంటున్నారు. ఐదుగురు వ్యక్తులు సీబీఐ అధికారులమని చెప్పి శుక్రవారం ఆయన నివాసంలోకి చొరబడ్డారు. తుపాకీలతో బెదిరించి లుఖోయ్​తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్​ చేశారు. ఆ తర్వాత లుఖోయ్​ భార్యకు ఫోన్​ చేసి రూ.15 లక్షలు డిమాండ్​ చేశారు నిందితులు.

ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వగా... గంట వ్యవధిలోనే కేసును చేధించారు పోలీసులు. సెంట్రల్​ కోల్​కతాలోని బెనియాపుర్ ప్రాంతంలో బందీగా ఉన్న లుఖోయ్​ను రక్షించారు. ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. రెండు వాహనాలు, మూడు నకిలీ తుపాకులు, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో ఇద్దరు మణిపుర్​, మరొకరు పంజాబ్​కు​ చెందిన వారు. వీరిలో ఇద్దరిపై గతంలో క్రిమినల్​ కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

సులభంగా డబ్బును సంపాదించాలనే ఉద్దేశంతోనే కిడ్నాప్​ చేశారని పోలీసులు విచారణలో తేల్చారు. మణిపుర్​కు చెందిన వ్యక్తి ఇందుకు వ్యూహరచన చేసి, అక్కడి నుంచే కథను నడిపించాడని గుర్తించారు.

ఇదీ చూడండి:భరత నాట్య కళాకారిణి లీలా శాంసన్​పై సీబీఐ కేసు

Digital Advisory
Saturday 14th December 2019
Clients, please note we are currently seeking clarity over our usage of FIS World Cup events taking place in Switzerland.
As things stand, we no longer expect the following highlights today:
WINTER SPORT: FIS Alpine Ski World Cup, Women's Super-G from Saint Moritz.
WINTER SPORT: FIS Cross-Country World Cup, Men's and Women's Sprint F from Davos.
Apologies for any inconvenience. A further advisory will confirm any updates or changes to the situation.
Regards,
SNTV London
Last Updated : Dec 14, 2019, 7:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.