ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి మనాస్ సాహూ దివంగత నేత అరుణ్‌జైట్లీకి వినూత్న రీతిలో నివాళులు అర్పించారు. పూరీ తీరంలో జైట్లీ సైకత శిల్పాన్ని అద్భుతరీతిలో రూపొందించారు. దేశానికి ఆయన విశిష్ట సేవలు అందించారని కొనియాడారు సాహూ.




భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం తుదిశ్వాస విడిచారు. దిల్లీలోని నిగంబోధ్ఘాట్లో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.
ఇదీ చూడండి:- 'భాజపా ట్రబుల్ షూటర్‌గా జైట్లీ ముద్ర ప్రత్యేకం'