ఎంతో ఇష్టంగా పెంచుకున్న శునకాన్ని కొండ చిలువ చెర నుంచి చాకచక్యంగా కాపాడుకున్నాడు ఓ వ్యక్తి. ఏకంగా గంటపాటు కొండచిలువతో పోరాడి తన పెంపుడు జంతువును రక్షించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక ఉడుపి జిల్లాలో జరిగింది.
రవి శెట్టి అనే వ్యక్తికి.. తన పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం. ఓ రోజు బైందూర్ సమీపంలోని గోలిహల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. కాసేపటి తర్వాత ఏదో పనిలో ఉండగా.. పెద్దగా కుక్క మూలుగులు వినిపించాయి. బయటకు వచ్చి చూస్తే.. ఇరవై అడుగుల కొండచిలువ దాన్ని చుట్టుముట్టి ఆరగించేందుకు ప్రయత్నిస్తోంది. వెంటనే ఏం చేయాలో తోచక అటవీశాఖలో పనిచేసే తన మిత్రుడు రాజీవ్గౌడకు సమాచారం ఇచ్చాడు రవి. అతడి సాయంతో.. గంటకు పైగా ప్రయత్నించి కొండచిలువ చెర నుంచి తన కుక్కను కాపాడుకున్నారు.
"నేను ఫాంహౌజ్ లోపల ఉన్నాను. నా పెంపుడు కుక్క అరుపులు వినిపించాయి. చూస్తే 20 అడుగుల కొండచిలువ దాన్ని చుట్టుముట్టి తినడానికి ప్రయత్నిస్తోంది. వెంటనే నా మిత్రునికి సమాచారం ఇచ్చాను. ఇద్దరం కలిసి పెంపుడు కుక్కను దాని చెర నుంచి విడిపించడానికి గంట పైనే సమయం పట్టింది. తక్కువ గాయాలతో నా కుక్క బయటపడినందుకు ఆనందంగా ఉంది"
--- రవి శెట్టి
ఇదీ చూడండి: మోదీ కోసం కొత్త విమానం- ప్రత్యేకతలు ఇవే...