ఓ 24ఏళ్ల వ్యక్తి.. కరోనా బాధితురాలికి సంబంధించిన ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆ స్టేటస్‌లో రోగిపై అసభ్యకరమైన మాటలు రాశాడు. చివరికి పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
వైరస్ సోకిందని...
కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన 24ఏళ్ల అనిల్ రాథోడ్.. ఓ విద్యార్థిని ఫొటోను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. ఆమె వైరస్ పాజిటివ్ అని క్యాప్షన్‌లో రాశాడు. ఈ విధంగా ప్రవర్తించి అతడు ప్రజల్ని.. భయాందోళనకు గురి చేయడానికి ప్రయత్నించిన కారణంగానే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. విద్యార్థినిని కించపరచడానికే అతడు.. ఫొటోను వైరల్ చేసినట్టు వివరించారు.
"కరోనా వైరస్ బాధితుల వివరాలు, ఫొటోలను ప్రజా వేదికల్లో పెట్టడం, వారి గుర్తింపును బహిర్గతం చేయడం నేరం. అసత్య ప్రచారాలతో భయాందోళనలు రేకెత్తించిన అనిల్‌పై కేసు నమోదు చేశాం."
--- పోలీసు అధికారి.
ఇదీ చూడండి:- ఆ బాధలో 17వ అంతస్తు నుంచి దూకాలనుకుంది.. కానీ!