ETV Bharat / bharat

ఉమ్మినందుకు గొడవ- ఓ యువకుడు మృతి - దిల్లీ నేరవార్తలు

బహిరంగంగా ఉమ్మేయటంపై ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మరణించాడు. నెట్​వర్క్ ఇంజినీర్​గా పనిచేస్తోన్న ప్రవీణ్​ రహదారిపై ఉమ్మటాన్ని చూసి అంకిత్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి పోట్లాడుకోగా.. తీవ్రంగా గాయపడిన అంకిత్ చనిపోయాడు.

DL-SPITTING-MURDER
యువకుడి హత్య
author img

By

Published : Jun 11, 2020, 5:58 PM IST

దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బహిరంగంగా ఉమ్మేశాడని ప్రశ్నించటం వల్ల ప్రారంభమైన గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు పోలీసులు.

బహిరంగ ప్రదేశంలో పదే పదే ఉమ్మి వేస్తున్న ప్రవీణ్‌ అనే వ్యక్తిని అంకిత్‌ వారించాడు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ మొదలై పరస్పరం భౌతిక దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించి బుధవారం రాత్రి 8:30 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం వచ్చింది. ఘటనా ప్రదేశానికి వెళ్లగా, అప్పటికే ఇద్దరు వ్యక్తులు రక్తపుమడుగులో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

"ఉమ్మేసిన విషయంలో అంకిత్​, ప్రవీణ్​ పోట్లాడుకున్నారు. ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. అంకిత్​కు అంతర్గతంగా అధిక రక్తస్రావం కావటం వల్ల మరణించాడు. హత్య కేసు నమోదు చేసి ప్రవీణ్​ను అరెస్టు చేశాం."

- ఐష్ సింఘాల్​, డీసీపీ, న్యూదిల్లీ

భాయ్​ వీర్​ సింగ్ మార్గ్​లో నివసించే అంకిత్​ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. రాజా బజార్​లో ఉండే ప్రవీణ్​ నెట్​వర్క్ ఇంజినీర్ అని తెలిసింది.

ఇదీ చూడండి: మూగజీవికి నరకయాతన.. ఈ సారి శునకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.