కరోనా అనుమానితుడిని అసోం రాష్ట్రంలోని సిల్చార్ బౌండ్ రైలులో పట్టుకున్నారు ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారులు. అతడు కేరళ నిర్బంధ కేంద్ర నుంచి పారిపోయినట్లు వెల్లడించారు. కరోనా సోకినట్లు అనుమానిస్తున్న అతడిని అసోంలోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు తెలిపారు. అంతేకాకుండా సదరు వ్యక్తి ప్రయాణించిన ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు.. కొన్ని రోజుల పాటు స్వీయ నిర్బంధంలోనే ఉండాలని వారికి సూచించారు.
ఇదీ జరిగింది...
కేరళ నిర్బంధ కేంద్ర నుంచి కరోనా అనుమానితుడు ఒకరు పారిపోయినట్లు గుర్తించిన అధికారులు.. రైల్వే రక్షణ దళానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు... అతను సిల్చార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.
నిర్బంధ కేంద్రం నుంచి అసోం మోరగాన్ జిల్లాలోని తన ఇంటికి వెళ్లేందుకు అతడు పారిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఇంతే...
ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఓ వ్యక్తి నిర్బంధ కేంద్రం నుంచి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల కోసం రక్త నమూనాలు ఇచ్చిన కాసేపటికే మాయమయ్యాడు. అప్రమత్తం అయిన అధికారులు వెంటనే అతడిని ఫోన్ ద్వారా సంప్రదించి, తిరిగి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైద్య పరీక్షల విషయంలో జాప్యం పట్ల ఆగ్రహానికి గురై, అతడు వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్నారు అధికారులు.
ఇదీ చూడండి:'ఏడేళ్ల తర్వాత నిర్భయ ఆత్మకు శాంతి'