భాజపాపై మరోసారి విమర్శలు గుప్పించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జాతీయ పౌర రిజిస్టార్ ప్రవేశపెడతామన్న కమలం పార్టీ తప్పుడు ప్రచారాలతో ఆరుగురు బలయ్యారని వెల్లడించారు. బంగాల్‌లో ఎన్ఆర్సీని నిర్వహించబోమని పేర్కొన్నారు.
కోల్‌కతాలో కార్మిక సంఘాలతో సమావేశమైన మమతా.. బంగాల్‌లో ఎన్ఆర్సీని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోనని స్పష్టం చేశారు. బంగాల్‌తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ దీనిని నిర్వహించబోరని పేర్కొన్నారు.
చాలా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు మమతా. దేశంలో యువత ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనంపై భాజపా దృష్టిపెట్టడం లేదని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని విమర్శించారు.
ఇదీ చూడిండి : ఆర్థిక సంక్షోభంతో 178 ఏళ్ల నాటి కంపెనీ దివాలా!