ETV Bharat / bharat

చైనా సరిహద్దులకు బంగాల్​ కార్బైన్​లు - ishapur ordinance factory

సైనికులకు అందించే తుపాకులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తుపాకులను సరఫరా చేయాలని ప్రతిపాదించింది. ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా బంగాలో తయారైన తుపాకీలు(కార్బైన్​) అందజేయాలని భావిస్తోంది.

make in india guns to be used in china boarder
చైనా సరిహద్దులకు బెంగాల్​ కార్బైన్​లు
author img

By

Published : Oct 8, 2020, 5:36 AM IST

చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో సైనికులకు పశ్చిమ్ బంగాలో తయారైన తుపాకీలు(కార్బైన్​) అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలుత విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తుపాకులను సరఫరా చేయాలని ప్రతిపాదించింది. అయితే అక్కడ నుంచి తగినంతగా వచ్చే అవకాశాలు లేకపోవటంతో 'భారత్​లో తయారీ'పై దృష్టి పెట్టింది.

దీనిలో భాగంగా పశ్చిమ్​ బంగాలోని ఇషాపూర్​లో ఉన్న ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీలో తయారయ్యే తుపాకులను సరఫరా చేస్తే బాగుంటుందని నిర్ణయించింది. దాంతో వాటి సామర్థ్యాన్ని సంబంధిత అధికారులు పరీక్షించి చూశారు. మరిన్ని కఠిన పరీక్షలు చేసిన అనంతరం తయారీకి ఆర్డర్లు ఇవ్వనున్నారు. తొలుత తక్కువ మొత్తంలోనే సేకరించాలని నిర్ణయించారు. త్రివిధ దళాలకు మొత్తం 3.5లక్షల తుపాకులు అవసరం ఉంటుందని అంచనా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.