ETV Bharat / bharat

కరోనా కుట్ర: నేపాల్​ నుంచి బిహార్​కు 50 మంది చొరబాటు! - CORONA VIRUS DEATH TOLL

బిహార్​లోని ఓ జిల్లా యంత్రాంగానికి సశస్త్ర సీమా బల్​​ రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఇండో-నేపాల్​ సరిహద్దు నుంచి ఒక వర్గానికి చెందిన కొందరు దేశంలోకి ప్రవేశించి కరోనా వైరస్​ను వ్యాప్తి చేయాలని కుట్ర పన్నుతున్నట్టు ఆ లేఖలో పేర్కొంది. జలీమ్​ ముఖియా అనే వ్యక్తి ఇందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

MAJOR CONSPIRACY TO SPREAD CORONA VIRUS INDIA
కరోనా కుట్ర: నేపాల్​ నుంచి బిహార్​కు 50 మంది చొరబాటు!
author img

By

Published : Apr 11, 2020, 9:18 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

భారత్​లో కరోనా వ్యాప్తికి భారీ కుట్ర జరిగిందా? పొరుగు దేశం నుంచి కొందరు అక్రమంగా చొరబడి వైరస్​ను వ్యాప్తి చేయాలనుకున్నారా? సశస్త్ర సీమా బల్​(ఎస్​ఎస్​బీ​) రాసిన ఓ లేఖను చూస్తే వీటికి అవుననే సమాధానాలు వస్తున్నాయి.

ఎస్​ఎస్​బీ 47వ బెటాలియన్​ ఇటీవలే బిహార్​లోని బేతియా జిల్లా యంత్రాంగానికి ఓ లేఖ రాసింది. ఒక వర్గానికి చెందిన కొందరు.. ఇండో-నేపాల్​ సరిహద్దు మీదగా భారత్​లోకి అక్రమంగా చొరబడి వైరస్​ను వ్యాప్తి చేయడానికి కుట్ర పన్నారని అందులో పేర్కొంది. దీనికి జలీమ్​ ముఖియా అనే వ్యక్తి ప్రణాళిక రచించినట్టు వివరించింది.

లేఖలోని ముఖ్యాంశాలు:

  • 40-50మందిని నేపాల్​ ద్వారా భారత్​కు పంపేందుకు జలీమ్​ ముఖియా కుట్ర పన్నాడు.
  • వీరిలో పాకిస్థాన్​ సహా మరికొన్ని దేశాలకు చెందిన వారు ఉన్నారు.
  • వీరందరూ ప్రస్తుతం నేపాల్​లోని ఓ ప్రార్థనా మందిరంలో ఆశ్రయం పొందుతున్నారు.
  • రానున్న రోజుల్లో వీరు బిహార్​లోకి అక్రమంగా చొరబడి దేశంలో వైరస్​ను వ్యాప్తి చేయాలని భావిస్తున్నారు.
    MAJOR CONSPIRACY TO SPREAD CORONA VIRUS INDIA
    లేఖ

ఎవరీ జలీమ్​ ముఖియా?

బిహార్​-నేపాల్​ సరిహద్దు ప్రాంతమైన పార్శా జిల్లాలోని జగర్​నాథ్​పుర్​ గ్రామపెద్ద జలీమ్​. భారత్​-నేపాల్​ సరిహద్దులో స్మగ్లింగ్​కు పాల్పడుతుంటాడని ఇతడిపై ఆరోపణలున్నాయి.

జలీమ్​ ముఖియా

అధికారులు అప్రమత్తం...

ఎస్​ఎస్​బీ​ లేఖతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దు వెంబడి నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. సీసీటీవీ కెమెరాల సాయంతో సరిహద్దులోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. 24గంటల పాటు గస్తీ నిర్వహిస్తోంది.

ఈ వ్యవహారంపై బిహార్​ డీజీపీ గుప్తేశ్వర్​ పాండేను సంప్రదించింది ఈటీవీ భారత్​. సరిహద్దును పూర్తిగా మూసివేశామని, బిహార్​లోకి ఎవరూ ప్రవేశించే అవకాశమే లేదని స్పష్టంచేశారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు.

బిహార్​ డీజీపీ గుప్తేశ్వర్​ పాండే

'దేశంతో నాకు ఎనలేని సంబంధం ఉంది..'

'కరోనా కుట్ర' ఆరోపణలపై జలీమ్​ ముఖియా స్పందించాడు. తనకు భారత్​ అంటే ఎంతో ఇష్టమని, దేశంతో తనకు ఎనలేని సంబంధం ఉందని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. కరోనా వైరస్​ను వ్యాప్తి చేయాలన్ని ఉద్దేశం తనకు లేదని తెలిపాడు. సంక్షోభంలోనూ కొందరు రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని జలీమ్​ ఆరోపించాడు. తనపై ఇలాంటి ఆరోపణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని భారత హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాస్తానని వెల్లడించాడు.

ఇదీ చూడండి:- వెంటాడిన కరోనా భయాలు.. ఇద్దరు ఆత్మహత్య

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.