మహారాష్ట్రలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముంబయిలో వానల బీభత్సం కొనసాగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. వర్షాల ధాటికి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
కొల్హాపుర్లో...
కొల్హాపుర్లో భారీ ఎత్తున వరద నీరు చేరింది. పట్టణం నుంచి వెళ్లే పుణె-బెంగళూరు హైవే మొత్తంగా నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో సహాయక చర్యలను ముమ్మరం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.
గోవా కోస్ట్గార్డ్స్కు చెందిన 22 మంది బృందంతో ఓ హెలికాప్టర్ రంగంలోకి దిగింది. వరద బాధితులకు పడవల ద్వారా ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సాయం అందిస్తున్నాయి. 204 వరద ప్రభావిత గ్రామాల్లోని 11,432 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు సిబ్బంది.
కేబినెట్ భేటీ
రాష్ట్రంలో వరదలపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో కేబినెట్ భేటీ నిర్వహించారు. పునరావాస చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆల్మట్టి ఆనకట్ట నుంచి నీటిని దిగువకు విడుదల చేయాలని కర్ణాటక సీఎం యెడియూరప్పను కోరారు ఫడణవీస్.
ఇదీ చూడండి: 'వెంకయ్య, సుష్మల అన్నాచెల్లెల అనుబంధం'