ETV Bharat / bharat

'మహా' ప్రతిష్టంభన: నేడు గవర్నర్​ను కలవనున్న భాజపా! - maharashtra bjp shiv sena alliance

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన మధ్య గవర్నర్​ భగత్​ సింగ్​ కోషియారీని నేడు భాజపా ప్రతినిధుల బృందం కలవనుంది. ఈ బృందానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్​ నేతృత్వం వహించనున్నారు. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలతో నేడు సమావేశం కానున్నారు శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే.

నేడు గవర్నర్​ను కలవనున్న భాజపా!
author img

By

Published : Nov 7, 2019, 5:05 AM IST

Updated : Nov 7, 2019, 7:22 AM IST

నేడు గవర్నర్​ను కలవనున్న భాజపా

మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్​ 9తో ముగియనున్న వేళ.. రాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భాజపా-శివసేన మధ్య నెలకొన్న విభేదాలు కొలిక్కి రాక ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ప్రభుత్వ ఏర్పాటుపై రెండు రోజుల్లో అధికార కూటమి పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని భాజపా వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 9లోపే నూతన ప్రభుత్వ కొలువుదీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశాయి. భాగస్వామ్య పార్టీ శివసేనతో సంప్రదింపులు పూర్తయినట్లేనని పేర్కొన్నాయి.

గవర్నర్​తో భేటీ..

ప్రభుత్వ ఏర్పాటుపై మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోషియారీని నేడు కలవనుంది భాజపా ప్రతినిధుల బృందం. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్​ వీరికి నేతృత్వం వహించనున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ ఆమోదం తెలిపిన సందేశాన్ని గవర్నర్​కు చేరవేయనున్నట్లు తెలిపారు భాజపా నేత, రాష్ట్ర మంత్రి ముంగంటివార్​. గవర్నర్​తో భేటీ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

పార్టీ నేతలో ఠాక్రే సమావేశం..

శివసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత ఉద్ధవ్​ ఠాక్రే నేడు ఉదయం 11:30 గంటలకు సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పట్టు వీడని సేన..

ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లేనని అధికార భాజపా తెలిపినప్పటికీ.. శివసేన తన పట్టు వీడినట్లు కనిపించటం లేదు. భాజపా నుంచి తమతో ఎవరూ సంప్రదింపులు జరపలేదని సేన నేత సంజయ్​ రౌత్​ స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే వద్దకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు.

ఇదీ చూడండి: మహా ప్రతిష్టంభనకు తెర! త్వరలో ప్రభుత్వం ఏర్పాటు

AP Video Delivery Log - 2100 GMT News
Wednesday, 6 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2054: Bolivia Protests AP Clients Only 4238540
Clashes erupt across Bolivia as unrest continues
AP-APTN-2046: UK Corbyn No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4238538
Corbyn comments on Johnson article, age and Brexit
AP-APTN-2040: Lebanon Protest Vigil AP Clients Only 4238537
Women hold vigil in Beirut in support of protests
AP-APTN-2010: US House Taylor Transcript AP Clients Only 4238536
Democrats release transcript of key State witness
AP-APTN-2010: US Pentagon Qatar AP Clients Only 4238535
Esper welcomes Qatar counterpart to Pentagon
AP-APTN-1947: Mexico Americans Killed AP Clients Only 4238532
Mexico community shaken after violent killings
AP-APTN-1937: US MO King Boulevard Part must credit KCTV; No access Kansas City market; No use US broadcast networks; No re-use, re-sale or archive 4238531
Kansas City votes to remove MLK's name from street
AP-APTN-1904: US CA Dumpster Bear Must credit Placer County Sheriff's Office 4238530
California deputies rescue dumpster-diving bear
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 7, 2019, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.