ETV Bharat / bharat

'మహా'లో శాంతించని కరోనా.. కొత్తగా 9,601 కేసులు - Gujarath corona details

మహారాష్ట్రలో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 9,601 కేసులు నమోదయ్యాయి. మరో 322మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 4లక్షల 31వేలు దాటింది. దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో మరో 5,879 మంది వైరస్​ బారినపడ్డారు.

TAMILANADU CORONA CASE DETAILS
తమిళనాట కొవిడ్​ ఉగ్రరూపం.. 4వేలు దాటిన మృతులు
author img

By

Published : Aug 1, 2020, 7:06 PM IST

Updated : Aug 1, 2020, 9:11 PM IST

దేశంలో కొవిడ్​ కోరలు చాస్తోంది. వైరస్​ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కొత్తగా 9,601 కేసులు నమోదయ్యాయి. మరో 322మంది వైరస్​కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,719కి చేరింది. ఇప్పటివరకు 15,316మంది ప్రాణాలు కోల్పోయారు. 2,66,883 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

తమిళనాడులో 4వేలు దాటిన మృతులు

తమిళనాడులోనూ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కొత్తగా 5,879 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 2,51,738కి పెరిగింది. మరో 99 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 4 వేలు దాటింది. అయితే ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,90,966 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.

కర్ణాటకలో 5వేలకుపైగా..

కర్ణాటకలో వరుసగా తొమ్మిదో రోజూ రికార్డు స్థాయిలో 5వేలకుపైగా వైరస్​ కేసులు వెలుగుచూశాయి. తాజాగా 5,172 మంది వైరస్​ బారినపడగా.. మొత్తం కేసుల సంఖ్య 1,29,287కు పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో 98 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,412కు చేరింది. వైరస్​ నుంచి కోలుకుని 53,648 మంది డిశ్చార్జ్​ అవ్వగా.. 73,219 మంది చికిత్స పొందుతున్నారు.

యూపీలో ఇలా..

ఉత్తర్​ప్రదేశ్​లో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది కరోనా. 3,807 కొత్త కేసులు వెలుగు చూడగా.. మొత్తం బాధితుల సంఖ్య 89,068కి చేరింది. మరో 47 మంది వైరస్​ సోకి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,677కు పెరిగింది. ఇప్పటివరకు 51,354 మందికి వైరస్​ నయమవగా.. మరో 36,037 మంది చికిత్స పొందుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దిల్లీలో అలా..

దేశ రాజధాని దిల్లీలో తాజాగా 1,118 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,36,716కు పెరిగింది. మరో 26 మంది వైరస్​ ధాటికి బలవ్వగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,989కి చేరింది. వైరస్​ బారినపడిన వారిలో 1,22,131 మంది కోలుకోగా.. 10,596 మంది ఆయా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

గుజరాత్​లో వెయ్యికిపైగా

గుజరాత్​లో 24 గంటల్లో 1,136 కొవిడ్​ కేసులు బయటపడగా.. మొత్తం బాధితుల సంఖ్య 62,574కి చేరింది. మరో 24 మంది వైరస్​కు బలవ్వగా.. మరణాల సంఖ్య 2,465కి పెరిగింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 45,782 మంది కోలుకున్నారు. 14,327 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: దిల్లీలో 50 రోజులకు పెరిగిన కరోనా డబ్లింగ్​ రేటు

Last Updated : Aug 1, 2020, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.