మహారాష్ట్ర శాసనమండలి సభ్యునిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం ప్రమాణం చేశారు. దక్షిణ ముంబయిలోని విధాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఠాక్రే సహా ఎమ్మెల్సీగా ఎన్నికైన మరో 8 మందితో మండలి ఛైర్మన్ రామ్రాజే నాయక్ నింబాల్కర్ ప్రమాణం చేయించారు.
ఉద్ధవ్ ఠాక్రేతో పాటు మండలి డిప్యూటీ ఛైర్మన్, శివసేన నేత నీలమ్ గోర్హే, నలుగు భాజపా అభ్యర్థులు మోహిత్ పాటిల్, గోపిచంద్ పడాల్కర్, ప్రవీణ్ దట్కే, రమేశ్ కరద్, ఎన్సీపీ నేతలు శశికాంత్ షిండే, అమోల్ మిట్కారి, కాంగ్రెస్ నేత రాజేశ్ రాఠోడ్ ప్రమాణం చేశారు.
288 స్థానాలున్న శాసనమండలిలో ఏప్రిల్ 24 వరకు 9 ఖాళీలు ఏర్పడ్డాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికి ముఖ్యమంత్రి ఠాక్రే, గవర్నర్ వినతి మేరకు ఈనెల 14న ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల సంఘం.