దీర్ఘకాలం రక్షణ రంగంలో సేవలందించిన నౌక ఐఎన్ఎస్ విరాట్ విచ్ఛిన్నంపై పెద్ద వివాదం చెలరేగింది. గుజరాత్‌లోని అలంగ్ తీర ప్రాంతంలో నౌకను విచ్ఛిన్నం చేసే ప్రక్రియను ప్రారంభించింది శ్రీరామ్ గ్రూప్ సంస్థ. అయితే 'విరాట్' విచ్ఛిన్న ప్రక్రియను తక్షణమే నిలిపేవేయాలంటూ రక్షణ శాఖకు లేఖ రాశారు మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది. నౌకను గోవా తీరంలో ఉంచి మ్యూజియంగా మార్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని పేర్కొన్నారు.


అయితే నౌకను కావాలనుకున్నవారు వచ్చి సర్వే చేసుకోవాలని సూచించింది శ్రీరామ్ గ్రూప్ సంస్థ.


తమ సొంత ప్రయోజనాల కోసం రాజకీయ, సామాజిక నేతలు కలిసి ఐఎన్ఎస్ విరాట్‌ను రాజకీయం చేస్తున్నారని నౌక యజమాని ముకేశ్‌భాయ్ పటేల్ అన్నారు. ఇప్పటివరకు విరాట్ గురించి లిఖితపూర్వకంగా గానీ మాటలద్వారా గానీ ఎవరూ ప్రస్తావించలేదన్న ఆయన.. నౌకను విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు వివాదం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.


ఇదీ చూడండి: 'రూ.100 కోట్లకు ఐఎన్ఎస్ విరాట్ అమ్మకం'