ETV Bharat / bharat

కరోనా ప్రతాపం.. ఆ రాష్ట్రంలో మరో మంత్రికి వైరస్​

Maharashtra minister Aslam Shaikh tests coronavirus positive
కరోనా ప్రతాపం.. ఆ రాష్ట్రంలో మరో మంత్రికి వైరస్​
author img

By

Published : Jul 20, 2020, 10:10 AM IST

Updated : Jul 20, 2020, 10:36 AM IST

10:28 July 20

మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా కరోనా బాధితుల జాబితాలోకి చేరుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి అస్లాం షేక్​కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలింది. దీంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.  

"కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. కానీ నాకు ఎటువంటి వైరస్​ లక్షణాలు లేవు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాను. గత కొద్ది రోజుల నుంచి నన్ను కలిసిన వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను."

-అస్లాం షేక్​, మహారాష్ట్ర టెక్స్​టైల్​ మంత్రి.  

సదరు మంత్రి ముంబయి పశ్చిమ మాలాడ్​ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కొద్దిరోజులు.. ముంబయిలో తన నివాసం నుంచే విధులను నిర్వర్తించనున్నారు అస్లాం షేక్​. 

ఉద్దవ్​ ఠాక్రే కేబినెట్​లో కరోనా సోకిన నాలుగో మంత్రి అస్లాం. అంతకుముందు.. జితేంద్ర ఆవాద్​, అశోక్​ చవాన్​, ధనంజయ్​ ముండే కరోనా బారినపడి.. కొద్దిరోజులకు కోలుకున్నారు.    

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,10,455కు చేరింది. 11,585 మంది వైరస్​కు బలయ్యారు.

10:04 July 20

కరోనా ప్రతాపం.. ఆ రాష్ట్రంలో మరో మంత్రికి వైరస్​

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రజాప్రతినిధులూ వరుసగా కొవిడ్​ బారినపడుతున్నారు. తాజాగా రాష్ట్ర టెక్స్​టైల్​ మంత్రి అస్లాం షేక్​కు వైరస్​ సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపిన ఆయన.. తనతో సన్నిహితంగా మెలిగిన వారందరినీ టెస్టులు చేయించుకోవాల్సిందిగా సూచించారు.

Last Updated : Jul 20, 2020, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.