ETV Bharat / bharat

కరోనా కేసుల్లో చైనాను దాటేసిన మహారాష్ట్ర

author img

By

Published : Jun 7, 2020, 8:47 PM IST

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య 2.46 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 7వేలకు చేరువైంది. కేసులపరంగా మహారాష్ట్ర.. కొవిడ్​-19 పుట్టినిల్లు చైనాను దాటేసింది. మొత్తం కేసులు 85వేల దాటాయి. తమిళనాడులో వరుసగా ఎనిమిదో రోజు వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి.

Maharashtra has surpassed China's COVID-19 tally
కరోనా కేసుల్లో చైనాను దాటిన మహారాష్ట్ర

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డు​ స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్​ బాధితుల సంఖ్య 2,46,625కు చేరింది. 6,929 మంది మరణించారు. ఇప్పటివరకు 1,19, 292 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

మహారాష్ట్రలో 3వేలకుపైగా..

మహారాష్ట్రలో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 3,007 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 85,975కు చేరింది. గత 24గంటల్లో 91 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 3060కి చేరింది. కేసుల సంఖ్యలో చైనా (83,036)ను దాటేసేంది మహారాష్ట్ర. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 39,314 మంది కోలుకున్నారు.

తమిళనాడులో..

తమిళనాడులోనూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 1,515 మందికి పాజిటివ్​గా తేలింది. 18మంది మృతి చెందారు. వరుసగా ఎనిమిదో రోజు వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 31,667కి, మృతుల సంఖ్య 269కి చేరింది.

గుజరాత్​లో..

గుజరాత్​లోనూ వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 480మందికి కరోనా సోకింది. 30మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 20,097, మృతుల సంఖ్య 1249కి చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,205మంది చికిత్స పొందుతున్నారు.

బంగాల్​లో..

బంగాల్​లో ఇవాళ 449 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వరుసగా మూడోరోజు అత్యధిక కేసులు వచ్చాయి. గత 24గంటల్లో 13 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 324కు చేరింది.

కర్ణాటకలో..

కర్ణాటకలో కొత్తగా 239 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వ్యాధి సోకిన వారిలో ఇద్దరు మరణించగా మృతుల సంఖ్య 61కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 5వేల 452కు ఎగబాకింది.

కేరళలో..

కేరళలో ఇవాళ 107మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసులు సంఖ్య 19,014కు చేరింది.

ఛత్తీస్​గఢ్​లో..

ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా 74 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 997కి ఎగబాకింది. కరోనా నుంచి కోలుకొని 173 మంది ఇంటికి చేరుకోగా.. నలుగురు మరణించారు.

హరియాణాలో..

హరియాణలో కొత్తగా 191కేసులు నిర్ధరణకాగా మొత్తం కేసుల సంఖ్య 4వేల 143కి చేరుకుంది. కరోనా సోకి 24మంది మృతి చెందారు. వ్యాధి నుంచి 2వేల 824 మంది కోలుకున్నారు. బిహార్‌లో 141 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా.. కేసుల సంఖ్య 4వేల 972కు ఎగబాకింది.

కరోనాతో జవాను మృతి

దిల్లీలోని సీఆర్​పీఎఫ్​ 141 బెటాలియన్​కు చెందిన ఓ జవాను కరోనా కారణంగా మృతిచెందాడు. కేంద్ర సాయుధ దళాల్లో వైరస్​తో మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. సీఏపీఎఫ్​ దళాల్లో కరోనా సోకినవారి సంఖ్య 1550కి చేరింది. ఇప్పటి వరకు 1100 మంది కోలుకున్నారు.

ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 70లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.