మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. అగ్రనేతల తీరిక లేని ర్యాలీలతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి తారస్థాయికి చేరింది. ఇందులో భాగంగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేలు నేడు వేరువేరు సభల్లో పాల్గొనున్నారు.
కేంద్రం, రాష్ట్రంలో భాజపా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్న అమరావతిలో ప్రసంగించనున్నారు షా. మెల్ఘట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. ఇక్కడి నుంచి రమేశ్ మవాస్కర్ను బరిలో దింపింది భాజపా.
అమరావతిలోని దసరా మైదాన్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు ఉద్ధవ్ ఠాక్రే . శివసేన అభ్యర్థులు ప్రీతీ బంద్ (బద్నేరా నియోజకవర్గం), రాజేశ్ వాంకడే (టియోసా),సునితా ఫిస్కే (అచల్పూర్) తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. 124 స్థానాల్లో శివసేన, 164 సీట్లల్లో భాజపా బరిలో దిగనుంది. ఈ నెల 21న ఎన్నికలు జరగనునండగా.. 24 న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసులో మరో మలుపు!