ETV Bharat / bharat

'నీటి బిల్లును మా సీఎం ఎప్పుడో చెల్లించారు' - fadnavis

మహారాష్ట్ర ముఖ్యమంత్రి నీటి బిల్లు బకాయి ఉన్నారంటూ వచ్చిన వార్తలపై ఆ రాష్ట్ర ప్రజా పనుల శాఖ స్పందించింది. గతేడాది నవంబర్​లోనే సీఎం అధికారిక నివాసం 'వర్ష'కు సంబంధించిన బిల్లు చెల్లించారని, అయితే క్లియరెన్స్​లో వచ్చిన చిన్న తేడా కారణంగా ఈ తప్పిదం జరిగిందని వివరించింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి
author img

By

Published : Jun 24, 2019, 5:42 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​తో సహ మంత్రులు నీటి బిల్లులు బకాయి పడ్డ వార్తలను ఆ రాష్ట్ర ప్రజా పనుల శాఖ ఖండించింది. ఆ బిల్లులు ముందే చెల్లించారని, అయితే సర్దుబాటులో చిన్న తేడా కారణంగా గతేడాది లెక్కలను పరిగణనలోకి తీసుకోకపోవటమే ఈ తప్పిదానికి కారణమని తెలిపింది.

"అధికారిక భవనాల పేర్ల మీదనే బిల్లు ఉన్నాయి. వీటిని వ్యక్తిగత ఖాతాలకు ఆపాదించటం సరైన చర్య కాదు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నీటి బిల్లులను 2018 నవంబర్​లోనే చెల్లించారు. అయితే బకాయి క్లియరెన్స్​ ప్రక్రియలో భాగంగా పాతవాటిని పరిగణనలోకి తీసుకోలేదు. "

-మహారాష్ట్ర ప్రజాపనుల శాఖ

ఇదీ జరిగింది..

సీఎంతో సహ మంత్రుల అధికారిక నివాసాలకు సంబంధించి నీటి బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని సమాచార హక్కు ప్రశ్నకు సమాధానంగా బృహన్ ​ముంబయి నగరపాలక సంస్థ(బీఎంసీ) పేర్కొంది. ఈ మేరకు సీఎం అధికారిక భవనం 'వర్ష'తో పాటు 18 మంది రాష్ట్ర మంత్రుల భవనాలను పన్ను ఎగవేత జాబితాలో చేర్చినట్టు తెలిపింది. సుధీర్ ముంగన్​తివార్, వినోద్​ తావ్డే, పంకజ్ ముండే, రాందాస్​ కదమ్, ఏక్​నాథ్​ శిందే సహా మరికొందరు మంత్రులు ఈ జాబితాలో ఉన్నట్టు వెల్లడించింది.

ఇదీ చూడండి: సీఎం ఇంటి నీటి బిల్లు బకాయి రూ. 7లక్షలు!

Intro:Body:

ER

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.